Share News

Tomato Storage Tips: ఫ్రిజ్ లేకపోయినా టమోటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచే మేజిక్ ట్రిక్ ఇదే!

ABN , Publish Date - Aug 25 , 2025 | 03:12 PM

టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండటానికి వాటిని ఫ్రిజ్‌లో పెడతారు. అయితే, ఫ్రిజ్ లేకపోయినా టమోటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచే మేజిక్ ట్రిక్స్‌ కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Tomato Storage Tips: ఫ్రిజ్ లేకపోయినా టమోటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచే మేజిక్ ట్రిక్ ఇదే!
Tomato Storage Tips

ఇంటర్నెట్ డెస్క్‌: టమోటాలు మన వంటలో ముఖ్యమైన భాగం. ఇవి ఆహార రుచిని పెంచుతాయి. అంతేకాకుండా ఇవి ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. చాలా మంది టమోటాలను ఎక్కువ మొత్తంలో కొని ఇంట్లోని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటారు. అయితే, కొన్నిసార్లు టమోటాలను ఫ్రిజ్‌లో ఉంచినా కూడా అవి చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి, వాటిని చెడిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఫ్రిజ్ లేకపోయినా కూడా టమోటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచే మేజిక్ ట్రిక్స్‌ కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


టమోటాలను తాజాగా ఉంచడానికి ఇది సులభమైన మార్గం. అర టీస్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు కలిపిన నీటిలో టమోటాలను కొన్ని నిమిషాలు నానబెట్టడం వల్ల వాటి ఉపరితలంపై ఉన్న బ్యాక్టీరియా, దుమ్ము తొలగిపోతాయి. ఆ తరువాత టమోటాలను శుభ్రమైన నీటిలో కడిగి ఆరబెట్టండి.


రిఫ్రిజిరేటర్ లేనివారు టమాటాలను కార్డ్‌బోర్డ్ పెట్టెల్లో నిల్వ చేసుకోవచ్చు. ముందుగా, టమాటాలను కడిగి ఆరబెట్టి, ఒకదానికొకటి తగలకుండా ఒక పెట్టెలో ఉంచండి. వారానికి ఒకసారి కొద్దిసేపు ఎండలో ఉంచితే, టమాటాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.


టమోటాలు రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. వీటిలో లైకోపీన్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి రక్షిస్తాయి. టమోటాలు తినడం వల్ల చర్మం మెరుస్తుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందువల్ల, మీ రోజువారీ ఆహారంలో టమోటాలను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


Also Read:

జీడిపప్పు తింటే సన్నగా అవుతారా.! ఇందులో నిజమెంత?

లాప్‌టాప్‌ను క్లీన్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లల్లో రాత్రిళ్లు మాత్రమే కనిపించే సమస్యలు ఇవీ

Updated Date - Aug 25 , 2025 | 03:12 PM