Share News

WhatsApp Image Scam: వాట్సాప్‌లో ఇలా చేస్తున్నారా.. ఒక్క క్లిక్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ..

ABN , Publish Date - May 06 , 2025 | 03:23 PM

WhatsApp Photo scam Alert: వాట్సాప్ యూజర్లు జాగ్రత్త. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ అకౌంట్లపై కన్నేసారు. మీరు అలవాటు ప్రకారం తెలియక ఇలా చేశారంటే మాత్రం ఫోన్ క్షణాల్లో హ్యాక్ అయిపోయి బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయిపోతాయి. యూజర్ల స్కామర్ల చేతికి చిక్కకూడదంటే వెంటనే ఇలా చేయాలని టెలికాం శాఖ అధికారులు సూచిస్తున్నారు.

WhatsApp Image Scam: వాట్సాప్‌లో ఇలా చేస్తున్నారా.. ఒక్క క్లిక్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ..
WhatsApp Photo Scam

WhatsApp Steganography Scam: టెక్నాలజీ పెరిగేకొద్దీ సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు అమాయకులను దోచుకునేందుకు సరికొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇటీవల స్కామర్లు వాట్సాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ కొత్త స్కాం ద్వారా ఇప్పటికే కోట్ల రూపాయలు మోసపోయారు యూజర్లు. దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్ అకౌంట్ ఉంటుంది. నిత్యం తెలిసిన వ్యక్తులు, తెలియని వ్యక్తుల నుంచి మెసేజెస్, ఫొటోలు, వీడియోలు, ఆడియోలు వెల్లువలా వచ్చిపడుతూ ఉంటాయి. ఆఫీసు పనుల కోసం, ఎక్కువ మంది కాంటాక్ట్స్ ఉన్నవారి వాట్సాప్ ఖాతాలోనైతే మరీ ఎక్కువ. చాలా సార్లు ఎవరు ఎప్పుడూ మెసేజ్ చేశారో గమనించరు యూజర్లు. ఈ కాస్త ఉదాసీనతే మీ కొంప ముంచుతుంది. దొంగ చేతికి తాళాలిచ్చినట్టుగా రెప్పపాటులోనే మీ ఫో‌న్ హ్యాక్ చేసి బ్యాంకు ఖాతా ఖాళీ చేసే అవకాశం సైబర్ నేరగాళ్లకు మీరే ఇచ్చినట్టవుతుంది. ఇంతకీ ఏంటా స్కాం? ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి?


వాట్సాప్ ఇమేజ్ స్కామ్ అంటే ఏమిటి?

  • వాట్సాప్ వినియోగదారులకు తెలియని నంబర్ నుంచి ఇమేజ్ వస్తుంది.

  • అవి మీమ్స్, గ్రీటింగ్స్ లేదా ఎవరో ఫార్వార్డ్‌ చేసిన కొటేషన్ లాగే కనిపించవచ్చు. కానీ ఈ ఫొటోలో మాల్వేర్ కోడ్ ఉంటుంది.

  • ఫోటో డౌన్‌లోడ్ అయిన వెంటనే మాల్వేర్ నిశ్శబ్దంగా యూజర్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. ఇది హ్యాకర్లకు మీ పరికరాన్ని యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

  • ఒకసారి ఫోన్ హ్యాక్ అయితే మాల్వేర్ మీ కీస్ట్రోక్‌లను ట్రాక్ చేయగలదు. బ్యాంకింగ్ యాప్‌లను యాక్సెస్ చేయగలదు. పాస్‌వర్డ్‌లను దొంగిలిస్తుంది. మీ గుర్తింపును కూడా క్లోన్ చేస్తుంది.

  • దీంతో సహా అనే కొత్త స్కామ్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు చాలా ఈజీగా ఫోన్ ట్రాక్ చేసి బ్యాంకు ఖాతా నుంచి డబ్బును నిశ్శబ్దంగా బదిలీ చేస్తారు.


ఎవరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు?

ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు ఇద్దరూ ప్రమాదంలో ఉన్నారని సైబర్ భద్రతా నిపుణులు అంటున్నారు. ఈ మోసాలు తరచుగా పండుగ సీజన్లు, పెద్ద అమ్మకాల ఈవెంట్లు లేదా వార్తలు చూసేటప్పుడు జరుగుతాయి. ఎందుకంటే ఆ సమయంలో ప్రజలు తెలియని మెసేజ్ లను ఎక్కువగా ఓపెన్ చేస్తారు.


వాట్సాప్ వాడేటప్పుడు సురక్షితంగా ఎలా ఉండాలి?

  • తెలియని వ్యక్తుల నుంచి ఫోటోలు లేదా ఫైళ్ళను ఎప్పుడూ డౌన్‌లోడ్ చేయవద్దు (మీ కుటుంబంలోని ప్రతి వ్యక్తిని జాగ్రత్తగా ఉండమని సూచించండి).

  • వాట్సాప్ సెట్టింగ్‌లలో మీడియా ఆటో-డౌన్‌లోడ్‌ను నిలిపివేయండి. ఎందుకంటే ఈ ఫీచర్ వల్ల మీకు తెలియకుండానే వాటంతట అవే ఇమేజెస్ డౌన్లోడ్ అయిపోతాయి.

  • మీ ఫోన్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయండి.

  • అనుమానాస్పద సందేశాలను WhatsAppకు రిపోర్ట్ చేయండి. పంపిన వారిని తక్షణమే బ్లాక్ చేయండి.

  • ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) కూడా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సలహాలు జారీ చేసింది.


ఈ స్కామ్ అధునాతన టెక్నాలజీని సైబర్ నేరగాళ్లు ఎలా వాడుకుని మోసాలకు తెగబడుతున్నారో తేటతెల్లం చేస్తుంది. కాబట్టి, WhatsApp వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. తెలియని లింక్‌లు లేదా మీడియాపై క్లిక్ చేయడం మానేయాలి. అవి ప్రమాదకరం కాదని అనిపించినప్పటికీ.


Read Also: Credit Card: క్రెడిట్‌ కార్డు మినిమమ్‌ అమౌంట్‌ కడుతున్నారా.. నష్టాలు తెలుసుకోండి..

Youtube: గత 3 ఏళ్లల్లో భారతీయులకు రూ.21 వేల కోట్లు చెల్లించిన యూట్యూబ్

Passkeys Replace Passwords: ఇకపై మైక్రోసాఫ్ట్ అకౌంట్స్‌కు పాస్‌వర్డ్స్ అవసరం ఉండదు.. సంస్థ కీలక ప్రకటన

Updated Date - May 06 , 2025 | 05:44 PM