Share News

Passkeys Replace Passwords: ఇకపై మైక్రోసాఫ్ట్ అకౌంట్స్‌కు పాస్‌వర్డ్స్ అవసరం ఉండదు.. సంస్థ కీలక ప్రకటన

ABN , Publish Date - May 02 , 2025 | 04:27 PM

పాస్‌వర్డ్స్ రహిత డిజిటల్ ప్రపంచంవైపు మళ్లుతున్న మైక్రోసాఫ్ట్ తాజాగా కీలక ప్రకటన చేసింది. పాస్‌వర్డ్స్‌కు బదులు పాస్‌కీలు వాడాలని యూజర్లకు విజ్ఞప్తి చేసింది. 99 శాతం మంది యూజర్లు ఇప్పటికే పాస్‌కీలు వాడుతున్నారని వెల్లడించింది.

Passkeys Replace Passwords: ఇకపై మైక్రోసాఫ్ట్ అకౌంట్స్‌కు పాస్‌వర్డ్స్ అవసరం ఉండదు.. సంస్థ కీలక ప్రకటన
Passkeys

ఇంటర్నెట్ డెస్క్: బ్యాంక్ అకౌంట్, ఈమెయిల్ అకౌంట్, విండోస్ అకౌంట్, మొబైల్ లాగిన్.. ఇలా ప్రతి సందర్భంలోనూ పాస్ వర్డ్స్ మనం వాడుతుంటాము. పాస్‌వర్డ్స్‌తో మన అకౌంట్స్ భద్రమని నమ్ముతాము. అయితే, పాస్‌వర్డ్స్ ఆధారంగా సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ సంస్థలన్నీ పాస్‌కీస్ వైపు మళ్లుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇకపై మైక్రోసాఫ్ట్ అకౌంట్స్‌కు పాస్‌వర్డ్స్ అవసరం లేదని పేర్కొంది. వినియోగదారులు పాస్‌కీల వైపు మళ్లాలని కూడా సూచిస్తోంది.

పాస్‌వర్డ్స్‌ వినియోగానికి ముగింపు పలకాలని నిశ్చయించుకున్న సంస్థ ఇకపై వినియోగదారులు తమ అకౌంట్‌లల్లో లాగిన్ కోసం బయోమెట్రిక్ ఆథెంటికేషన్, సెక్యూరిటీ కీస్, పిన్ నంబర్ల వంటివాటిని వినియోగించాలని సూచిస్తోంది. ఈ దిశగా మార్పులు చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది.


ఏమిటీ పాస్ కీస్

పాస్ కీస్ అనేవి క్రిప్టోగ్రాఫిక్ కీస్. వీటిని వ్యక్తుల ఎలక్ట్రానిక్ పరికరాల్లోనే నిక్షిప్తం చేస్తారు. వీటిని ఆయా వ్యక్తుల బయోమెట్రిక్ డాటాతో లింక్ చేస్తారు. పాస్‌వర్డ్స్‌కు ప్రత్యామ్నాయంగా వీటిని ఫాస్ట్‌ ఐడెంటిటీ ఆన్‌లైన్ అలయన్స్ (ఎఫ్ఐడీఓ) రూపొందించింది. ఈ టెక్ సంస్థల కూటమిలో మైక్రోసాఫ్ట్‌తో పాటు యాపిల్, గూగుల్ కూడా భాగస్వాములే. ఈ వ్యవస్థలో ఫింగర్ ప్రింట్స్ వంటి బయోమెట్రిక్ సమాచారం కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో, పాస్ కీస్‌ను పాస్‌వర్డ్స్ లాగా మరోకరు వినియోగించేందుకు సాధ్యం కాదు. అంతేకాకుండా, రకరకాల పాస్‌వర్డ్స్‌ను గుర్తుంచుకోవాల్సిన బాధ యూజర్లకు తప్పుతుంది.

ఇక మైక్రోసాఫ్ట్ కూడా లాగిన్ కోసం ఈ విధానం వైపు మళ్లుతోంది. 2015 నుంచే తాము ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పుకొచ్చింది. ఇప్పటికే తమ యూజర్లలో 99 శాతం మంది తమ విండోస్ అకౌంట్‌లో లాగిన్ అయ్యేందుకు పాస్ వర్డ్స్ వినియోగించరని తెలిపింది. ఇందుకు బదులుగా బయోమెట్రిక్స్ లేదా పిన్ నంబర్‌ను వినియోగిస్తు్న్నారని వెల్లడించింది.


సంప్రదాయిక పాస్‌వర్డ్స్‌తో హ్యాకింగ్ బెడద ఎక్కువవుతోంది. ప్రస్తుతం సెకెనుకు 7 వేల పాస్‌వర్డ్ ఆధారిత హ్యాకింగ్ ప్రయత్నాలను తాము గుర్తిస్తున్నామని సంస్థ చెప్పుకొచ్చింది. 2023 నాటితో పోలిస్తే దాడుల సంఖ్య రెట్టింపైందని కూడా వెల్లడించింది. కొత్త టెక్నిక్‌ల ద్వారా పాస్‌వర్డ్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేస్తున్న నేరగాళ్లు సులువుగా హ్యాకింగ్ చేస్తున్నారు. దీంతో పాస్ వర్డ్స్‌కు బదులు వినియోగదారులు పాస్‌కీస్ వంటి మరింత భద్రమైన ప్రత్యామ్నాయాలవైపు మళ్లాలని మైక్రోసాఫ్ట్ సూచించింది.

ఇవి కూడా చదవండి:

యూట్యూబ్ పుట్టి 20 ఏళ్లు.. ఇప్పటివరకూ ఎన్ని వీడియోలు అప్‌లోడ్ అయ్యాయంటే..

యూపీఐని మించిన టెక్నాలజీ.. చైనా రూటే సపరేటు

జపాన్‌లో మరో అద్భుతం.. ఆరు గంటల వ్యవధిలో రైల్వే స్టేషన్ నిర్మాణం

Read Latest and Technology News

Updated Date - May 02 , 2025 | 04:39 PM