Share News

Credit Card: క్రెడిట్‌ కార్డు మినిమమ్‌ అమౌంట్‌ కడుతున్నారా.. నష్టాలు తెలుసుకోండి..

ABN , Publish Date - May 03 , 2025 | 05:19 PM

తరచుగా ప్రజలు క్రెడిట్‌ కార్డు మినిమమ్‌ అమౌంట్‌ చెల్లించడం ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లు నుండి ఉపశమనం పొందుతారని అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. మీరు ఇలా పదే పదే చేస్తే, మీ CIBIL స్కోరు కూడా పడిపోవచ్చు.

Credit Card:  క్రెడిట్‌ కార్డు మినిమమ్‌ అమౌంట్‌ కడుతున్నారా.. నష్టాలు తెలుసుకోండి..
Credit Card

Credit Cards: గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో క్రెడిట్ కార్డుల వాడకం గణనీయంగా పెరుగుతోంది. 2024 నాటికి భారతదేశంలో క్రెడిట్ కార్డ్ హోల్డర్ల సంఖ్య 10 కోట్లకు చేరింది. ఇప్పుడు జనాలు ఫోన్లు, టీవీలు ఇలా ఏది కొనాలని అనుకున్నా క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. క్రెడిట్ కార్డు ఉపయోగించిన తర్వాత, మీరు దాని బిల్లు చెల్లించాలి. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించేటప్పుడు, మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో ఒకటి పూర్తిగా బిల్లు పే చేయడం, రెండవది మినిమమ్‌ అమౌంట్‌ లేదా మినిమమ్‌ డ్యూ కట్టడం, మూడవది అదర్ అమైంట్. ఏ నెల బిల్లు ఆ నెల కడితే ఏలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, కొంతమంది మినిమమ్‌ అమౌంట్ చెల్లించి తాత్కాలికంగా ఊరట పొందుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఏలాంటి నష్టాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..


CIBIL పై ప్రభావం

సాధారణంగా, మినిమమ్‌ అమౌంట్ చెల్లించడం వల్ల మీ CIBIL ప్రభావితం కాదు, కానీ మీరు ఇలా పదే పదే చేస్తే మీ క్రెడిట్ స్కోర్ ప్రభావితం కావచ్చు. నిజానికి, కనీస మొత్తాన్ని చెల్లించడం ద్వారా, మీ మిగిలిన మొత్తంపై వడ్డీ పడుతుంది. మీరు ఇలా పదే పదే చేస్తే, మీరు అప్పుల ఊబిలో చిక్కుకుంటారు. అటువంటి పరిస్థితిలో, రుణ మొత్తం తగ్గడానికి బదులుగా పెరుగుతుంది, ఇది CIBIL స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. కనీస మొత్తాన్ని చెల్లించడం వల్ల మీకు నష్టం జరుగుతుంది.

వడ్డీ భారం తప్పదు..

చాలా వరకు బ్యాంకులు మొత్తం బిల్లులో 5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులను బట్టి దీనిలో మార్పులుండొచ్చు. కానీ, కనీస చెల్లింపుల వల్ల కేవలం పెనాల్టీలు, లేటు ఫీజుల నుంచి మాత్రమే మీకు రిలీఫ్ ఉంటుంది. చెల్లించాల్సిన మొత్తానికి బ్యాంకు వడ్డీ మాత్రం తప్పదు. కాబట్టి, వీలైనంత వరకు చెల్లించాల్సిన మొత్తం ఏ నెలకు ఆ నెల క్లియర్ చేసుకుంటే మంచిది. లేదంటే వడ్డీ భారం పెరుగుతుంది.


Also Read:

Beer And Whisky: బీరు, విస్కీ కలిపితే ఏమవుతుందో తెలుసా..

ATM Fraud: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి

Woman Viral Video: ఈ సూప్ తాగే ధైర్యం ఉందా.. ఎలా చేసిందో చూస్తే నోరెళ్లబెడతారు..

Updated Date - May 03 , 2025 | 05:41 PM