Share News

Harbhajan Singh: కోహ్లీ రెండు సెంచరీలు చేస్తాడు: హర్భజన్ సింగ్

ABN , Publish Date - Oct 14 , 2025 | 09:22 PM

సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు.

Harbhajan Singh: కోహ్లీ రెండు సెంచరీలు చేస్తాడు: హర్భజన్ సింగ్
Virat Kohil

టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ గురించి క్రికెట్ ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన బౌలింగ్ తో ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. రిటైర్మెంట్ తర్వాత కూడ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ..క్రికెట్ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటాడు. తాజాగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పై హర్భజన్ సింగ్ పొగడ్తల వర్షం కురిపించాడు. విరాట్ రెండు సెంచరీలు చేస్తాడంటూ జోష్యం చెప్పాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..


సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా(Australia Tour) పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(Virat Kohil) గ్రౌండ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఐపీఎల్ 2025 తర్వాత ఈ ఇద్దరూ ఆటగాళ్లు తొలిసారి మైదానంలోకి బరిలోకి దిగుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా ఈ ఇద్దరూ ప్లేయర్లు రెడీ అవుతున్నారు. దాంతో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్ గురించి మాట్లాడిన హర్భజన్ సింగ్(Harbhajan Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాలో కోహ్లీ దుమ్మురేపుతాడని, కోహ్లీ(Virat Kohli)తో పాటు రోహిత్ శర్మ ఆటను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడని తెలిపాడు. ఫిట్‌నెస్ విషయంలో విరాట్ కోహ్లీ(Virat Kohli's fitness)కి తిరుగులేదని ధీమా వ్యక్తం చేశాడు. జట్టులో అతనే అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్ అని భజ్జీ అన్నాడు. ప్రస్తుతం అతనితో కలిసి ఆడుతున్న వారిలో చాలా మంది కంటే కూడా కోహ్లీ ఫిట్‌గా ఉన్నాడని తెలిపాడు.


ఇంకా హర్భజన్(Harbhajan Singh) మాట్లాడుతూ..' ఆస్ట్రేలియా సిరీస్ లో కోహ్లీ ఆట కోసం ఎదురుచూస్తున్నా. అతడు మరింత కాలం వన్డేల్లో కొనసాగాలని కోరుకుంటున్నా. ఆస్ట్రేలియా(Australia) కోహ్లీకి ఇష్టమైన ప్రదేశం. అక్కడ వేల కొద్దీ పరుగులు రాబట్టాడు. మరోసారి రాణిస్తాడని నమ్మకంగా ఉన్నాను. మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు సెంచరీలు చేస్తాడని ఆశిస్తున్నా' అని హర్భజన్ సింగ్(Harbhajan Singh) చెప్పుకొచ్చాడు.



ఇవి కూడా చదవండి:

Task cut out for Australia: భారత్‌తో సిరీస్ వేళ.. ఆస్ట్రేలియాకు డబుల్ షాక్!

India World Record: విండీస్‌పై విజయం..భారత్ ఖాతలో మరో వరల్డ్ రికార్డ్!

Vaibhav Suryavanshi: వైభవ్‌ మరో చరిత్ర

Updated Date - Oct 14 , 2025 | 09:22 PM