Share News

Vaibhav Suryavanshi: వైభవ్‌ మరో చరిత్ర

ABN , Publish Date - Oct 14 , 2025 | 04:41 AM

బాల బ్యాటింగ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ బిహార్‌ రంజీ జట్టు వైస్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. బుధవారం మొదలయ్యే ఈ రంజీట్రోఫీ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు...

Vaibhav Suryavanshi: వైభవ్‌ మరో చరిత్ర

బిహార్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక

పట్నా: బాల బ్యాటింగ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ బిహార్‌ రంజీ జట్టు వైస్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. బుధవారం మొదలయ్యే ఈ రంజీట్రోఫీ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్టు బిహార్‌ క్రికెట్‌ సంఘం సోమవారం ప్రకటించింది. దాంతో రంజీట్రోఫీ చరిత్రలో అతి చిన్న వయస్సులో వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్న క్రికెటర్‌గా వైభవ్‌ చరిత్ర సృష్టించనున్నాడు. వైభవ్‌ గత సీజన్‌లో 13 ఏళ్లప్పుడు రాజస్థాన్‌ తరపున ఐపీఎల్‌ అరంగేట్రం చేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. సకీబుల్‌ గనీని బిహార్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి...

నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్

ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2025 | 04:41 AM