Share News

India World Record: విండీస్‌పై విజయం..భారత్ ఖాతలో మరో వరల్డ్ రికార్డ్!

ABN , Publish Date - Oct 14 , 2025 | 04:05 PM

వెస్టిండీస్ తో సిరీస్ ను వైట్ వాష్ చేయడంతో భారత్ ఓ ప్రపంచ రికార్డును సాధించింది. ఒకే జట్టుపై వరుసగా ఎక్కువ సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా భారత్ ..వరల్డ్ రికార్డును సమం చేసింది.

India World Record: విండీస్‌పై విజయం..భారత్ ఖాతలో మరో వరల్డ్ రికార్డ్!
India World Record

స్వదేశంలో కరేబియన్ జట్టు అయిన వెస్టిండీస్ తో జరిగిన రెండు టెస్ట్ లు సిరీస్ ను భారత్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. టీమిండియా ప్లేయర్లు సమిష్టిగా రాణించి ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారు. రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కుల్దీప్‌కి దక్కగా.. సిరీస్‌లో ఓ సెంచరీతో పాటు ఎనిమిది వికెట్లు తీసిన రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్ గా సాధించిన తొలి టెస్టు సిరీస్ ఇదే కావడం గమన్హారం . ఇది ఇలా ఉంటే వెస్టిండీస్ తో సిరీస్ ను వైట్ వాష్ చేయడంతో భారత్ ఓ ప్రపంచ రికార్డును సాధించింది. ఒకే జట్టుపై వరుసగా ఎక్కువ సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా సౌతాఫ్రికా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది.


దక్షిణాఫ్రికా 1998-24 ()South Africa)మధ్యకాలంలో వెస్టిండీస్‌పై వరుసగా 10 టెస్ట్ సిరీస్‌లలో విజయం సాధించింది. అదే ప్రత్యర్థిపై భారత్ కూడా వరుసగా 10 టెస్టు సిరీస్ లను గెలిచింది.భారత్ 2002-25 మధ్యకాలంలో వెస్టిండీస్‌పై 10 టెస్ట్ సిరీస్‌లు(India Equal Test Cricket World Record) కైవసం చేసుకుంది. ఈ రెండు జట్ల తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియా కూడా వెస్టిండీస్‌(West Indies)పైనే ఈ రికార్డు సాధించడం విశేషం. ఆసీస్(Australia) ఇప్పటివరకు 9 సార్లు టెస్టు సిరీస్‌లలో పై చేయి సాధించింది. ఇక్కడ మూడు జట్లకు వరల్డ్ రికార్డును అందించిన ఘనత మాత్రం ఈ కరేబియన్ జట్టుకే దక్కుంది. మొత్తంగా వెస్టిండీస్ జట్టుకే ఈ చెత్త రికార్డులు సొంతమైంది.


ఒక ప్రత్యర్థిపై వరుసగా అత్యధిక టెస్ట్ సిరీస్ విజయాలు:

  • భారత్(10) vs వెస్టిండీస్ (2002-25)

  • దక్షిణాఫ్రికా(10) vs వెస్టిండీస్ (1998-24)

  • ఆస్ట్రేలియా(9) vs వెస్టిండీస్ (2000-22)

  • ఆస్ట్రేలియా(8) vs ఇంగ్లాండ్ (1989-2003)

  • శ్రీలంక(8) vs జింబాబ్వే (1996-20)



ఇవి కూడా చదవండి

Shubman Gill: కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్

Vaibhav Suryavanshi: వైభవ్‌ మరో చరిత్ర

Updated Date - Oct 14 , 2025 | 04:22 PM