Share News

Pakistan Players: పాక్ ఆటగాళ్లకు 'హైఫైవ్' ఇచ్చిన భారత్ ప్లేయర్

ABN , Publish Date - Oct 14 , 2025 | 08:28 PM

ఆసియాకప్ 2025 టోర్నమెంట్ లో ఇండియా, పాకిస్థాన్ మధ్య షేక్ హ్యాండ్ వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం మలేషియాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారత్ ప్లేయర్లు, పాక్ ప్లేయర్లకు హైఫైవ్ ఇచ్చారు.

Pakistan Players: పాక్ ఆటగాళ్లకు 'హైఫైవ్' ఇచ్చిన భారత్ ప్లేయర్

ఆసియాకప్ 2025 టోర్నమెంట్ లో ఇండియా, పాకిస్థాన్ మధ్య షేక్ హ్యాండ్ వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అదే విధం ఉమెన్స్ వరల్డ్ కప్ లో కూడా ఇటీవల పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ జట్టు పాక్ ప్లేయర్లతో కరచాలన చేయలేదు. దీంతో ఇక ఈ దాయాది దేశాల ప్లేయర్ల మధ్య కరచాలన జరగదని అందరూ భావించారు. అయితే మంగళవారం మలేషియాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారత్ ప్లేయర్లు, పాక్ ప్లేయర్లకు హైఫైవ్ ఇచ్చారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..


మంగళవారం మలేషియాలోని జోహోర్ బహ్రులో 'సుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్‌లో భారత్( Indian Team ), పాకిస్తాన్ మధ్య హాకీ మ్యాచ్ జరిగింది. ఈ జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో రెండు దేశాల జాతీయ గీతాలు ఆలపించాయి. తర్వాత భారత ఆటగాళ్ళు, పాకిస్తాన్ ప్లేయర్లతో హై-ఫైవ్‌(Indian Team High Fives With Pakistan) ఇచ్చుకున్నారు. అయితే, అక్కడ ఎటువంటి కరచాలనాలు జరగలేదు. ఆసియా కప్‌లో రెండు దేశాల క్రికెట్ జట్లు మధ్య వివాదం నెలకున్న కొన్ని వారాల తర్వాత తాజాగా ఇది జరిగింది, ఈ మ్యాచ్ లో ఇండియా పాకిస్తాన్ పై విజయం సాధించింది.


ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆసియా కప్ క్రికెట్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు పాకిస్తాన్‌తో(cricket handshake controversy) కరచాలనం చేయడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు కూడా పాకిస్థాన్ పై భారత్ సాధించిన విజయాలను అంకితం చేశాడు. చివరకు ఆసియా కప్(Asia Cup 2025) ట్రోఫీ గెలిచిన తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ నుండి ట్రోఫీని స్వీకరించడానికి టీమిండియా నిరాకరించింది. ఈ క్రమంలో తాజాగా భారత్ హాకీ జట్టు పాక్ ప్లేయర్లు హై ఫైవ్ ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



ఇవి కూడా చదవండి:

Task cut out for Australia: భారత్‌తో సిరీస్ వేళ.. ఆస్ట్రేలియాకు డబుల్ షాక్!

India World Record: విండీస్‌పై విజయం..భారత్ ఖాతలో మరో వరల్డ్ రికార్డ్!

Vaibhav Suryavanshi: వైభవ్‌ మరో చరిత్ర

Updated Date - Oct 14 , 2025 | 08:47 PM