Shubman Gill: ఫాలో ఆన్ ఆడించండంపై శుభ్‌మన్ గిల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:42 PM
శుభ్‌మన్ గిల్..విండీస్ ను ఫాలో ఆన్ ఆడించడంపై ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. విజయం సాధించాలనే లక్ష్యంతోనే వెస్టిండీస్‌ను ఫాలో ఆన్ ఆడించామని తెలిపాడు. ఇంకా మాట్లాడుతూ..
రెండో టెస్టులో వెస్టిండీస్ పై భారత్ మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇదే తొలి సిరీస్ విజయం. ఇక మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్..విండీస్ ను ఫాలో ఆన్ ఆడించడంపై ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. విజయం సాధించాలనే లక్ష్యంతోనే వెస్టిండీస్‌ను ఫాలో ఆన్ ఆడించామని తెలిపాడు. ఆఖరి రోజు గెలుపుకు కావాల్సిన 6 , 7 వికెట్లు తీయడం కష్టమవుతుందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నామననట్లు వెల్లడించారు.
ఇంకా శుభ్‌మన్ గిల్(Shubman Gill) మాట్లాడుతూ...'భారత జట్టుకు సారథ్యం వహించడం గొప్ప గౌరవం. కెప్టెన్సీకి నేను అలవాటు పడుతున్నాను. పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకుంటున్నాను. పరిస్థితులకు తగ్గట్లు ఏ ఆటగాడు పరుగులు చేస్తాడు..? ఏ బౌలర్ వికెట్ తీస్తాడనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక విండీస్(West Indies)తో మ్యాచ్ లో మాకు సుమారు 300 పరుగుల ఆధిక్యం లభించింది.
అదే సమయంలో తిరిగి మేము బ్యాటింగ్ చేసి 500 పరుగులు చేసినా.. ఆఖరి రోజు 5, 6 వికెట్లు తీయాల్సి వస్తే కష్టమవుతుందని భావించాం. ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతోనే ఫాలో ఆన్ ఆడించాం. ఆస్ట్రేలియా(Australia) పర్యటనకు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించాలనే నితీష్ రెడ్డిని త్వరగా బ్యాటింగ్ కు పంపించాము. ఎవ్వరం ఏం చేసినా జట్టు విజయం కోసమే చేస్తాము. ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రణాళికలు రచించలేదు'అని శుభ్‌మన్ గిల్ (Shubman Gill)చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
National Junior Athletics Championship: మోహిత్ వెంకట్రామ్ పసిడి ధమాకా
Vaibhav Suryavanshi: వైభవ్ మరో చరిత్ర
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి