Share News

Ind beats WI: విండీస్‌పై రెండో టెస్టులోనూ భారత్ ఘన విజయం.. సిరీస్‌ క్లీన్ స్వీప్

ABN , Publish Date - Oct 14 , 2025 | 11:04 AM

విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో, రెండు టెస్టుల సిరీస్ భారత్ సొంతమైంది.

Ind beats WI: విండీస్‌పై రెండో టెస్టులోనూ భారత్ ఘన విజయం.. సిరీస్‌ క్లీన్ స్వీప్
India vs West Indies, Ind Victorious

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. నేడు రెండో టెస్టులో ఘన విజయం సాధించడంతో సిరీస్ భారత్‌ సొంతమైంది. రెండో టెస్టులో ఆఖరి రోజున ఆటను 63/1 స్కోరుతో ప్రారంభించిన భారత్ ఆ తరువాత మరో రెండు వికెట్ల నష్టానికి 121 లక్ష్యాన్ని పూర్తి చేసి సునాయాస విజయం అందుకుంది. కేఎల్ రాహుల్ (ఓవర్ నైట్ స్కోరు 25) 58 పరుగులు సాధించి అర్ధశతకంతో మెరిశాడు. 30 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన సాయి సుదర్శన్ 39 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్ రోస్టన్ ఛేజ్ 2 వికెట్లు తీయగా, జోమెల్ వారికన్ ఒక వికెట్ తీశాడు (Ind Beat WI in Test Series).


తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లు అదరగొట్టడంతో భారత్ 518/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభమన్ గిల్ (129), యశస్వి (175), ధ్రువ్ జురెల్ అద్భుత ఆటతీరుతో జట్టు విజయానికి బాటలు వేశారు. ఇక బౌలింగ్‌లోనూ భారత్ సత్తా చాటడంతో విండీస్ 248 పరుగులకే కుప్ప కూలి ఫాలో ఆన్ ఆడింది. కుల్‌దీప్ యాదవ్ 5 వికెట్లు తీయగా, జడేజా 3 వికెట్లు తీసి జట్టుకు కీలకంగా నిలిచారు. తమ ఇన్నింగ్స్‌లో ఈసారి అద్భుత పొరాట పటిమనను కనబరిచిన విండీస్ ప్లేయర్లు క్రికెట్ అభిమానులను మెప్పించగలిగారు. కాంప్‌బెట్(115), షై హోప్ (103), జస్టిన్ గ్రీవ్స్ (50), రోస్టన్ ఛేజ్ (40), జైడెన్ సీల్స్ (32) రాణించారు. అయిేతే, 390 పరుగులకు ఆలౌట్ అయిన విండీస్ చివరకు రెండో టెస్టును చేజార్చుకుంది.


ఇవి కూడా చదవండి

National Junior Athletics Championship: మోహిత్‌ వెంకట్రామ్‌ పసిడి ధమాకా

Vaibhav Suryavanshi: వైభవ్‌ మరో చరిత్ర

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 14 , 2025 | 11:49 AM