Gill Copies Dhoni: ధోనీని అనుసరించిన శుభ్‌మన్ గిల్!
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:46 PM
కెప్టెన్‌గా తొలి టెస్టు సిరీస్ సాధించిన శుభ్‌మన్ గిల్.. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రారంభించిన సంప్రదాయాన్ని కొనసాగించాడు. బీసీసీఐ కార్యదర్శి రాజీవ్ శుక్లా చేతులమీదుగా విన్నింగ్ ట్రోఫీ అందుకున్న గిల్..
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0తో క్లీన్ చేసింది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇండియా 7 వికెట్ల విజయం సాధించింది. ఇదే సమయంలో కెప్టెన్‌గా తొలి టెస్టు సిరీస్ సాధించిన శుభ్‌మన్ గిల్.. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రారంభించిన సంప్రదాయాన్ని కొనసాగించాడు. బీసీసీఐ కార్యదర్శి రాజీవ్ శుక్లా చేతులమీదుగా విన్నింగ్ ట్రోఫీ అందుకున్న గిల్.. దానిని జట్టులోకి కొత్తగా వచ్చిన నారాయణ్ జగదీశన్ చేతికి అందించాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శుభ్‌మన్ గిల్ నారాయణ్ జగదీశన్(N Jagadeesan)కు ఇచ్చే సమయంలో ఓ చిలిపి పని చేశాడు. ట్రోఫీని గిల్ జగదీశన్‌కు ఇస్తుండగా..అతడి చేతిలో నుంచి రవీంద్ర జడేజా లాక్కున్నాడు. కాస్త ఆట పట్టించిన తర్వాత తిరిగి ఇచ్చేసాడు. అనంతరం జట్టు సభ్యులు, మిగిలిన బృందం అంతా కలిని ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చారు. గిల్(Shubman Gill), యశస్వి జైస్వాల్ ట్రోఫీ పట్టుకొని ఫొటోలకు పోజులిచ్చారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి గిల్, కుల్‌దీప్ స్పెషల్ ఫొటోలు దిగారు. ఇక జట్టులో కొత్తగా వచ్చిన ప్లేయర్ కు ట్రోఫీని అందించే సంప్రదాయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా ప్రారంభించాడు.
ధోని(MS Dhoni)తర్వాత కెప్టెన్లుగా వ్యవహరించిన కింగ్ విరాట్ కోహ్లీ(Virat Kohli), హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. తాజాగా యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) కూడా సీనియర్ల బాటలోనే పయణిస్తున్నాడు. దీంతో గిల్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ధోని, కోహ్లీ, రోహిత్(Rohit Sharma) సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న గిల్..వారి స్థాయిలో స్టార్ డమ్ సంపాదిస్తాడని పలువురు క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
India World Record: విండీస్‌పై విజయం..భారత్ ఖాతలో మరో వరల్డ్ రికార్డ్!
Vaibhav Suryavanshi: వైభవ్ మరో చరిత్ర