Share News

Virat Kohli-Rohit Sharma: ఫేర్‌వెల్ లేకుండానే రోహిత్-కోహ్లీ రిటైర్మెంట్.. తప్పెవరిది..

ABN , Publish Date - May 12 , 2025 | 01:56 PM

BCCI: భారత జట్టుకు మూలస్తంభాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. లాంగ్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు హిట్‌మ్యాన్ ప్రకటించిన కొంత గ్యాప్‌లోనే కింగ్ కూడా ఇదే బాటలో నడుస్తూ తన డెసిషన్ వెల్లడించాడు. అయితే ఇద్దరికీ ఫేర్‌వెల్ మ్యాచ్ లభించకపోవడం బాధాకరమనే చెప్పాలి. దీనికి రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli-Rohit Sharma: ఫేర్‌వెల్ లేకుండానే రోహిత్-కోహ్లీ రిటైర్మెంట్.. తప్పెవరిది..
Virat Kohli

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకున్నాడు. 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. ఇప్పటికే టీ20ల నుంచి తప్పుకున్న కింగ్.. ఇకపై వన్డేల్లోనే కనిపించనున్నాడు. సారథి రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన షార్ట్ గ్యాప్‌లోనే కోహ్లీ కూడా అదే బాటలో నడవడంతో భారత టెస్ట్ టీమ్ ఫ్యూచర్ సందిగ్ధంలో పడింది. ఇద్దరు దిగ్గజాలు వెళ్లిపోవడంతో కుర్రాళ్లతో కూడిన జట్టు ఎలా రాణిస్తుందోననేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇదే తరుణంలో రోహిత్-కోహ్లీ రిటైర్మెంట్‌ మీదా జోరుగా చర్చ నడుస్తోంది. ఇద్దరూ ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే ఫార్మాట్ నుంచి తప్పుకోవడం ఏంటనే డిస్కషన్స్ ఊపందుకున్నాయి. ఎందుకిలా చేశారని అంతా ఆలోచనల్లో పడ్డారు.


రిక్వెస్ట్ చేశారా..

వన్డేలు, టీ20ల సంగతి ఎలా ఉన్నా.. టెస్టుల్లో మాత్రం ఏ ప్లేయర్ అయినా ఫేర్‌వెల్ కోరుకుంటారు. క్రికెట్‌లో అత్యున్నత ఫార్మాట్‌గా భావించే టెస్టుల్లో తమ సన్నిహితులు, స్నేహితులు, కుటుంబసభ్యులు, అభిమానుల మధ్య చివరి మ్యాచ్ ఆడి గ్రాండ్‌గా వీడ్కోలు పలకాలని భావిస్తారు. అందుకే ఆటగాళ్లు ఫామ్ కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నా ఫేర్‌వెల్ మ్యాచ్‌లో ఆడిస్తుంటాయి బోర్డులు. కొన్నిసార్లు చివరి పోరులో కెప్టెన్సీ చేసే చాన్స్ కూడా ఇస్తుంటాయి. అయితే కోహ్లీ-రోహిత్‌ మాత్రం ఫేర్‌వెల్ లేకుండానే టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి వీళ్లిద్దరి తప్పా.. లేదా బీసీసీఐదే మిస్టేకా అనే అనుమానాలు వస్తున్నాయి.


బీసీసీఐ తప్పా..

సాధారణంగా క్రికెట్‌లో ఆటగాళ్లే తమకు ఫేర్‌వెల్ మ్యాచ్ కావాలని కోరుకుంటారు. బోర్డులు కూడా ఆయా ఆటగాళ్ల స్థాయి, క్రేజ్‌ను బట్టి చివరి మ్యాచ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటాయి. ఒక్కోసారి అభిమానుల డిమాండ్‌ను బట్టి బోర్డులు కూడా ఫేర్‌వెల్ మ్యాచ్‌ ఆడాలని వాళ్లను కోరతాయి. కానీ రోహిత్-కోహ్లీ విషయంలో ఎందుకిలా జరిగిందో బయటకు రావడం లేదు. ఫేర్‌వెల్ మ్యాచ్ కావాలని వీళ్లిద్దరూ బీసీసీఐని రిక్వెస్ట్ చేసినట్లు వార్తలు రాలేదు. హిట్‌మ్యాన్ ఐపీఎల్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటిస్తే.. విరాట్ తాజాగా అనౌన్స్‌మెంట్ చేశాడు. బహుశా వన్డేల్లో కొనతున్నందున ఆ ఫార్మాట్‌లో రిటైర్ అయ్యే టైమ్‌లో ఫేర్‌వెల్ ఉంటే బాగుంటుందని వాళ్లు కోరుకొని ఉండొచ్చు.


ఆపిందెవరు..

డబ్ల్యూటీసీ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుండటం, ఇంగ్లండ్‌లో సిరీస్ జరగనుండటంతో ఫేర్‌వెల్‌ మ్యాచ్ కోరండం కరెక్ట్ కాదని భావించే చాన్స్ కూడా ఉంది. దీనికి తోడు ఇటీవల కాలంలో టెస్టుల్లో ఇద్దరూ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడ్డారు. అది కూడా వీడ్కోలు కోరుకోకుండా వారిని ఆపి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ కూడా ఫేర్‌వెల్ లాంటి సెంటిమెంట్స్‌ను పక్కనబెట్టి ముందుకెళ్లాలనే ఆలోచనతో ఇలా వ్యవహరించి ఉండొచ్చని కూడా వినిపిస్తోంది. ఏదేమైనా చివరిసారి తమ ఫేవరెట్ క్రికెటర్ల ఆటను చూసి మురిసే అవకాశం, వాళ్లిద్దరి రిటైర్మెంట్‌ను మరింత ఎమోషనల్ అయ్యే చాన్స్‌ను అభిమానులు కోల్పోయారనేది మాత్రం వాస్తవం.


ఇవీ చదవండి:

కోహ్లీకి దక్కే పెన్షన్ ఎంతంటే..

ఆ రోజు క్రికెట్ వదిలేస్తా: రోహిత్

మోదీ పర్మిషన్ ఇస్తారా..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 12 , 2025 | 02:10 PM