Share News

Shubman Gill: గిల్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. స్మిత్, ఫిలిప్స్‌ను ఓడించి..

ABN , Publish Date - Mar 12 , 2025 | 05:28 PM

ICC: టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అరుదైన అవార్డును కొల్లగొట్టాడు. ఇతర స్టార్ల నుంచి తీవ్ర పోటీ ఉన్నా పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు గిల్. మరి.. ఆ అవార్డు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

Shubman Gill: గిల్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. స్మిత్, ఫిలిప్స్‌ను ఓడించి..
Shubman Gill

టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చాంపియన్స్ ట్రోపీ-2025లో వైస్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతడు అద్భుతంగా రాణించాడు. భారత్ కప్పును సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటోడు ఇప్పుడు డబుల్ హ్యాపీగా ఉన్నాడు. దీనికి ఒక కారణం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌ను దక్కించుకోవడం.. మరో కారణం ఓ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికవడం. మరి.. గిల్‌కు దక్కిన ఆ అవార్డు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


అదే ప్లస్..

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు గిల్. ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ నుంచి తీవ్ర పోటీ ఎదురైనా అవార్డు భారత ఓపెనర్‌కే దక్కింది. చాంపియన్స్ ట్రోఫీతో పాటు అంతకుముందు జరిగిన ఇంగ్లండ్ వన్డే సిరీస్‌లో రాణించడం గిల్‌కు ప్లస్‌గా మారింది. ఆ సిరీస్‌లో 3 మ్యాచుల్లో కలిపి 259 పరుగులు చేశాడతను. ఇందులో 1 సెంచరీతో పాటు 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.


ఫుల్ హ్యాపీ

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికవడం మీద గిల్ రియాక్ట్ అయ్యాడు. చాలా హ్యాపీగా ఉందన్నాడు. ఇలాంటి పురస్కారాలు తాను మరింత బాగా పెర్ఫార్మ్ చేయడానికి, దేశానికి మరిన్ని ఘనవిజయాలు అందించడానికి ప్రోత్సాహకంగా ఉంటాయని చెప్పుకొచ్చాడు. కొత్త ఏడాదిలో వరుస విజయాలు, చాంపియన్స్ ట్రోఫీ కప్ అందుకోవడం, ఇప్పుడు ఐసీసీ పురస్కారం దక్కడం అద్భుతమని.. ఒక ఏడాదిలో ఇన్ని ఘనతలు అందుకోవడం కలగా ఉందన్నాడు గిల్. ఇక, శుబ్‌మన్‌కు ఐసీసీ పురస్కారం దక్కడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది అతడు పడిన కష్టానికి తగిన ఫలితమని అంటున్నారు. వైఫల్యాల నుంచి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ.. పట్టుదలతో ఆడటం వల్లే శుబ్‌మన్ ఈ స్థాయికి చేరుకున్నాడని మెచ్చుకుంటున్నారు.


ఇవీ చదవండి:

ర్యాంకింగ్స్.. టాప్‌-5లో ముగ్గురు భారత స్టార్లు

ధోని కొత్త అవతారం.. కప్పు కోసం..

లండన్‌కు గంభీర్.. స్కెచ్‌కు పిచ్చెక్కాల్సిందే

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2025 | 05:36 PM