Share News

Gautam Gambhir: దుబాయ్ టు లండన్‌.. గంభీర్ స్కెచ్‌కు పిచ్చెక్కాల్సిందే

ABN , Publish Date - Mar 12 , 2025 | 01:14 PM

ICC Champions Trophy 2025: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ కొత్త మిషన్ మొదలుపెట్టేశాడు. అందరూ ఇతర పనుల్లో బిజీ అయిపోతే.. అతడు మాత్రం సరికొత్త సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Gautam Gambhir: దుబాయ్ టు లండన్‌.. గంభీర్ స్కెచ్‌కు పిచ్చెక్కాల్సిందే
Gautam Gambhir

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్ పూర్తవడంతో అంతా ఐపీఎల్ కొత్త సీజన్ మీద ఫోకస్ చేస్తున్నారు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఆడిన వారిలో చాలా మంది తమ ఐపీఎల్ టీమ్స్‌తో జాయిన్ అయ్యారు. మరికొందరు ప్లేయర్లు ఇళ్లకు వెళ్లిపోయారు. కొంత రెస్ట్ తర్వాత ఫ్రాంచైజీలతో కలవనున్నారు. ఇలా ఎవరి పనుల్లో వారుండగా.. టీమిండియా హెచ్ కోచ్ గౌతం గంభీర్ కొత్త మిషన్ మొదలుపెట్టేశాడు. సైలెంట్‌గా స్కెచ్ వేస్తున్న గౌతీ.. లండన్‌కు వెళ్లే పనుల్లో బిజీగా ఉన్నాడట. పాత లెక్కలు తేల్చేందుకు ఆంగ్లేయుల గడ్డ మీదకు అతడు అడుగు మోపబోతున్నాడని తెలుస్తోంది. అసలు గౌతీ ప్లాన్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


తిరుగులేని శక్తిగా..

భారత హెడ్ కోచ్‌గా ఫస్ట్ టైమ్ గ్రాండ్ విక్టరీ చూశాడు గంభీర్. చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ సేనను విజేతగా నిలిపి తన కోచింగ్ క్యాపబిలిటీస్‌పై వస్తున్న విమర్శలను స్ట్రాంగ్‌గా తిప్పికొట్టాడు. అయితే ఇక్కడితో అయిపోలేదు. అతడి పర్యవేక్షణలో అటు టీ20లు, ఇటు వన్డేల్లో టీమిండియా తిరుగులేని రీతిలో విజయాలు సాధిస్తోంది. కానీ టెస్టుల్లో చతికిలపడుతోంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో వైట్‌వాష్ అవడం, ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చిత్తవడం అటు అభిమానుల్నే గాక ఇటు గంభీర్‌ను కూడా తీవ్రంగా బాధించింది. అందుకే లాంగ్ ఫార్మాట్‌లోనూ మన జట్టును తిరుగులేని శక్తిగా నిలబెట్టాలని అతడు భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే లండన్‌కు పయనం కానున్నాడని తెలుస్తోంది.


వరుస చాన్సులు..

ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో ఆడనుంది టీమిండియా. సుదీర్ఘ ఫార్మాట్‌లో వరుస షాక్‌ల నేపథ్యంలో ఇంగ్లండ్ సిరీస్‌పై ఫుల్ ఫోకస్ పెడుతున్నాడట గంభీర్. ఇంగ్లండ్ సిరీస్‌లో గెలిచి తీరాలని అనుకుంటున్నాడట. ఇందులో భాగంగానే ఈ సిరీస్ ఆరంభానికి ముందే ఇండియా-ఏ టీమ్‌తో అక్కడికి వెళ్లాలని భావిస్తున్నాడట. భారత ఏ జట్టులో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి, ఇంగ్లండ్ సిరీస్‌లో ఆడించాలనేది అతడి ప్లాన్‌ అని సమాచారం. రిజవ్వ్ పూల్‌లో ఉన్న ప్లేయర్ల టాలెంట్, ఫిట్‌నెస్, స్కిల్స్, అనుభం విషయంలో పూర్తి క్లారిటీకి రావాలని గౌతీ అనుకుంటున్నాడట. ఇంగ్లండ్ టూర్‌లో రాణించే ఇండియా ఏ ఆటగాళ్లను వరల్డ్ టెస్ట్ సైకిల్ 2025-27లో భారీగా అవకాశాలు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట. భారత టెస్ట్ టీమ్‌ను దుర్భేద్యంగా మార్చే ప్లాన్‌లో భాగంగానే రెస్ట్ తీసుకోకుండా లండన్ టూర్ ప్లాన్ చేస్తున్నాడట గౌతీ.


ఇవీ చదవండి:

ఆ భారత స్టార్ నా ఫేవరెట్: మాళవిక

పంత్-రైనాతో కలసి ధోని మాస్ డ్యాన్స్

మూర్ఖుల మాటల్ని పట్టించుకోవద్దు: జావేద్‌ అక్తర్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2025 | 01:14 PM