MS Dhoni: పంత్-రైనాతో కలసి ధోని మాస్ డ్యాన్స్.. విజిల్స్ వేస్తూ..
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:04 PM
IPL 2025: టీమిండియా స్టార్లంతా ఒక ఈవెంట్‌లో తెగ సందడి చేశారు. మాస్ స్టెప్స్ వేస్తూ పిచ్చెక్కించారు. అదిరిపోయే డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేశారు.

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ఏం చేసినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఎప్పుడో గానీ బయట కనిపించని మాహీ.. ఒకవేళ పబ్లిక్ స్పేస్‌లోకి వస్తే మాత్రం వైరల్ అయిపోతాడు. అతడు ఏం మాట్లాడినా, ఏం చేసినా ఇట్టే ట్రెండ్ అయిపోతుంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి చాలా కాలమే అయినా ఐపీఎల్‌లో ఆడుతూ, యాడ్స్ చేస్తూ, సేవా కార్యక్రమాల్లో భాగమవుతూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటూ పోతున్నాడు ధోని. అలాంటోడు తాజాగా మాస్ డ్యాన్స్‌తో పిచ్చెక్కించాడు.
ఈలలు, స్టెప్పులతో రచ్చ
పించ్ హిట్టర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి వివాహం గ్రాండ్‌గా జరిగింది. ముస్సోరిలో ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో పలువురు భారత క్రికెటర్లు సందడి చేశారు. అయితే ధోని, సురేష్ రైనా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. పంత్‌తో కలసి మాస్ స్టెప్స్ వేస్తూ అలరించారు. మాహీ అయితే చిన్నపిల్లాడిలా మారిపోయాడు. హుషారుగా డ్యాన్స్ చేస్తూ, విజిల్స్‌తో కాక పుట్టించాడు. పంత్, రైనా, ధోని ఎగురుతూ.. ఒకరి భుజాల మీద మరొకరు చేతులు వేసుకొని మాస్ స్టెప్స్ వేస్తూ హల్‌చల్ చేశారు. మాహీతో పాటు రైనా కూడా ఈలలు వేస్తూ రచ్చ రచ్చ చేశాడు. ఆ తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నాయి. ఇవి చూసిన నెటిజన్స్.. వాటే ఎనర్జీ, వాటే డ్యాన్స్.. అదరగొట్టారు భయ్యా అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
మూర్ఖుల మాటల్ని పట్టించుకోవద్దు: జావేద్ అక్తర్
భారత్ దూరం.. లార్డ్స్‌కు నష్టం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి