స్వదేశానికి చాంపియన్లు
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:50 AM
చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత జట్టు క్రికెటర్లు ఒక్కొక్కరుగా స్వదేశానికి చేరుకుంటున్నారు. సోమవారం కోచ్ గౌతమ్ గంభీర్, పేసర్ హర్షిత్ రాణాతో....

న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత జట్టు క్రికెటర్లు ఒక్కొక్కరుగా స్వదేశానికి చేరుకుంటున్నారు. సోమవారం కోచ్ గౌతమ్ గంభీర్, పేసర్ హర్షిత్ రాణాతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ తన కుటుంబసభ్యులతో ముంబైకి చేరుకున్నాడు. అయితే మరికొంత మంది ఆటగాళ్లు రెండు, మూడు రోజుల పాటు దుబాయ్‌లోనే సేద తీరనున్నారు. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. భార్య అనుష్కతో కలిసి ఫైనల్ మ్యాచ్ ముగిసిన రోజు రాత్రే హోటల్ నుంచి వెళ్లిపోయాడు. ఈనెల 22 నుంచి ఐపీఎల్ ఆరంభం కానుండడంతో టీమిండియా ఆటగాళ్లకు విశ్రాంతి తీసుకునేందుకు బోర్డు అనుమతిచ్చింది. అందుకే ఈసారి విక్టరీ పరేడ్ కూడా నిర్వహించలేదు.
ఇవీ చదవండి:
అంత ఈజీనా.. బుమ్రా భార్యకు రాహుల్ కౌంటర్
ట్రోఫీ సెర్మనీకి పాక్ డుమ్మా.. తెగ్గొట్టిన ఐసీసీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి