Share News

Rishabh Pant: పంత్ ఇంటికి రోహిత్-కోహ్లీ.. ధోని అక్కడికే.. ఏం జరుగుతోంది బాస్

ABN , Publish Date - Mar 11 , 2025 | 04:12 PM

MS Dhoni: భారత స్టార్ల అడుగులు అంతా రిషబ్ పంత్ ఇంటి వైపే పడుతున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని కూడా పంత్ ఇంటికి పయనమవుతున్నాడు. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

Rishabh Pant: పంత్ ఇంటికి రోహిత్-కోహ్లీ.. ధోని అక్కడికే.. ఏం జరుగుతోంది బాస్
Rishabh Pant

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 కంప్లీట్ అవడంతో టీమిండియా ప్లేయర్లంతా స్వదేశానికి వచ్చేశారు. దుబాయ్ నుంచి నేరుగా తమ ఇళ్లకు చేరుకున్నారు. త్వరలో ఐపీఎల్-2025 స్టార్ట్ కానుండంతో కొందరు ఆటగాళ్లు డైరెక్ట్‌గా ఆయా ఫ్రాంచైజీల ట్రెయినింగ్ క్యాంప్స్‌కు చేరుకున్నారు. మరికొందరు ఇళ్లకు వెళ్లారు. కొంత రెస్ట్ తీసుకొని ఫ్రాంచైజీలతో జాయిన్ కానున్నారు. అయితే ఉన్నట్లుండి ఒక్కసారిగా అందరి అడుగులు పించ్ హిట్టర్ రిషబ్ పంత్ ఇంటి వైపు మళ్లుతున్నాయి. భారత సారథి రోహిత్ శర్మ దగ్గర నుంచి టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, దిగ్గజం ఎంఎస్ ధోని వరకు అంతా పంత్ ఇంటికి పయనమవుతున్నారు. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


ఆ ఈవెంట్ కోసమే..

పంత్ సోదరి సాక్షి పంత్ వివాహ వేడుక జరుగుతోందని తెలిసింది. ముస్సోరిలోని ఓ సీక్రెట్ లొకేషన్‌లో ఆమె మ్యారేజ్ జరుగుతోందట. పంత్ ఆహ్వానం మేరకు రోకో జోడీ, ధోని సహా భారత స్టార్లంతా ఆ పెళ్లికి అటెండ్ అయ్యేందుకు పయనం అయ్యారని సమాచారం. ప్రముఖ వ్యాపారవేత్త అంకిత్ చౌదరీతో పంత్ సోదరి సాక్షి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. 9 ఏళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట గతేడాది ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. 2024 జనవరి నెలలో లండన్‌లో నిర్వహించిన ఈ వేడుకకు ధోని హాజరవడం గమనార్హం. పెళ్లికి కూడా మాహీ వస్తున్నాడని.. అతడితో పాటు రోహిత్-కోహ్లీ లాంటి టాప్ స్టార్స్ అటెండ్ అవుతారని వినిపిస్తోంది. కాగా, సోదరి వివాహ కార్యక్రమాలు పూర్తయ్యాకే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో చేరతాడని తెలుస్తోంది.


ఇవీ చదవండి:

అంత ఈజీనా.. బుమ్రా భార్యకు రాహుల్ కౌంటర్

ట్రోఫీ సెర్మనీకి పాక్ డుమ్మా.. తెగ్గొట్టిన ఐసీసీ

నా నెక్స్ట్ టార్గెట్ అదే: రోహిత్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2025 | 04:57 PM