Share News

భారత్‌ దూరం.. లార్డ్స్‌కు నష్టం

ABN , Publish Date - Mar 12 , 2025 | 01:53 AM

భారత క్రికెట్‌ జట్టు ప్రపంచంలో ఎక్కడ ఆడినా స్టేడియాలు కళకళలాడుతుంటాయి. ఇక ఐసీసీ టోర్నీలయితే చెప్పనక్కర్లేదు. టిక్కెట్లు ఎంత ఖరీదైనా హాట్‌కేకుల్లా అమ్ముడుపోతుంటాయి...

భారత్‌ దూరం.. లార్డ్స్‌కు నష్టం

లండన్‌: భారత క్రికెట్‌ జట్టు ప్రపంచంలో ఎక్కడ ఆడినా స్టేడియాలు కళకళలాడుతుంటాయి. ఇక ఐసీసీ టోర్నీలయితే చెప్పనక్కర్లేదు. టిక్కెట్లు ఎంత ఖరీదైనా హాట్‌కేకుల్లా అమ్ముడుపోతుంటాయి. తాజాగా చాంపియన్స్‌ ట్రోఫీలోనూ అదే జరిగింది. ఇక లండన్‌లో జరిగే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప్స ఫైనల్‌కు కూడా టీమిండియా అర్హత సాధిస్తుందని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) గట్టి నమ్మకమే పెట్టుకుంది. అందుకే భారత అభిమానుల నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందన్న భావనతో ఫైనల్‌ టిక్కెట్‌ రేట్లను ఒక్కో దానిపై రూ.5 వేలకు పెంచింది. కానీ న్యూజిలాండ్‌, ఆస్ర్టేలియా జట్లపై సిరీ్‌సలను ఓడడంతో భారత్‌ ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరలేకపోయింది. ఈ దెబ్బకు ఈసీబీ తమ టిక్కెట్ల రేట్లను తగ్గించి రూ.4000-11000 మధ్య ఖరారు చేయడంతో రూ.45 కోట్ల నష్టం వాటిల్లనుంది. ఇంతకుముందే పాత ధరకు కొన్నవారికి మిగిలిన డబ్బును రిఫండ్‌ చేయనున్నారు. లార్డ్స్‌ వేదికగా జూన్‌ 11-15 తేదీల్లో ఆస్ర్టేలియా-దక్షిణాఫ్రికా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరుగుతుంది.

ఇవీ చదవండి:

అందరి అడుగులు పంత్ ఇంటి వైపే

అంత ఈజీనా.. బుమ్రా భార్యకు రాహుల్ కౌంటర్

ట్రోఫీ సెర్మనీకి పాక్ డుమ్మా.. తెగ్గొట్టిన ఐసీసీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2025 | 01:53 AM