మూర్ఖుల మాటల్ని పట్టించుకోవద్దు: జావేద్ అక్తర్
ABN , Publish Date - Mar 12 , 2025 | 02:08 AM
టీమిండియా పేసర్ షమికి బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ మద్దతుగా నిలిచారు. అతిగా స్పందించే మూర్ఖుల మాటలను...

న్యూఢిల్లీ: టీమిండియా పేసర్ షమికి బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ మద్దతుగా నిలిచారు. అతిగా స్పందించే మూర్ఖుల మాటలను పట్టించుకోవద్దన్నారు. ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్ మధ్యలో షమి ఎనర్జీ డ్రింక్ తాగాడు. దీంతో రంజాన్ నెలలో ఉపవాసం ఉండకుండా షమి పాపం చేశాడని అఖిల భారత ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వి విమర్శించారు. దీనిపై జావేద్ స్పందిస్తూ..‘షమి సాబ్.. దుబాయ్‌లోని క్రికెట్ మైదానంలో.. మండుటెండలో నీళ్లుతాగడాన్ని తప్పుబట్టే మూర్ఖుల మాటల్ని పట్టించుకోవద్దు. అద్భుత భారత జట్టులో నువ్వుకూడా ఒకడివైనందుకు గర్విస్తున్నా’ అని పోస్టు చేశారు.
ఇవీ చదవండి:
అంత ఈజీనా.. బుమ్రా భార్యకు రాహుల్ కౌంటర్
ట్రోఫీ సెర్మనీకి పాక్ డుమ్మా.. తెగ్గొట్టిన ఐసీసీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి