Share News

MS Dhoni Training: ధోని కొత్త అవతారం.. కప్పు కోసం బ్యాట్‌ను పక్కనపెట్టి..

ABN , Publish Date - Mar 12 , 2025 | 02:23 PM

IPL 2025: ఐపీఎల్ కొత్త సీజన్ కోసం జోరుగా సన్నద్ధమవుతున్నాడు లెజెండ్ ధోని. వయసు పెరుగుతున్నా అదే ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేస్తున్న మాహీ.. ట్రెయినింగ్ సెషన్స్‌లో కుర్ర క్రికెటర్లతో పోటీ పడుతున్నాడు.

MS Dhoni Training: ధోని కొత్త అవతారం.. కప్పు కోసం బ్యాట్‌ను పక్కనపెట్టి..
MS Dhoni

టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ప్రిపరేషన్ మోడ్‌లో బిజీగా ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నయా సీజన్‌కు సమయం దగ్గర పడుతుండటంతో సాధనలో వేగం పెంచుతున్నాడు మాహీ. చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ సెషన్‌లో అతడే మెయిన్ హైలైట్‌గా నిలుస్తున్నాడు. ప్యాడ్స్ కట్టుకొని, బ్యాట్ పట్టుకొని గ్రౌండ్‌లోకి దిగితే భారీ షాట్లతో అదరగొడుతున్నాడు ధోని. గ్లౌవ్స్ వేసుకొని కీపింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. అలాంటోడు కొత్త సీజన్ కోసం నయా అవతారం ఎత్తాడు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..


కుర్ర క్రికెటర్లతో..

నెవర్ బిఫోర్ అవతార్‌లో దర్శనమిచ్చాడు ధోని. చెన్నై సూపర్ కింగ్స్ నెట్ సెషన్ నుంచి బయటకొచ్చిన వీడియోల్లో ధోని ప్రాక్టీస్ చేయడమే గాక కోచింగ్ కూడా చేస్తూ కనిపించాడు. కుర్ర క్రికెటర్లకు అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ విలువైన సూచనలు ఇస్తూ దర్శనమిచ్చాడు మాహీ. యంగ్ ప్లేయర్స్‌తో చర్చిస్తూ.. వారికి అవసరమైన గైడెన్స్‌ను ధోని ఇవ్వడం వీడియోల్లో చూడొచ్చు. ఇది చూసిన నెటిజన్స్.. కప్పు కొట్టాలని కసిగా ఉన్న మహేంద్రుడు.. ఇప్పుడు కోచ్‌గా కొత్త అవతారం ఎత్తాడని కామెంట్స్ చేస్తున్నారు. ప్రత్యేకంగా కోచింగ్ స్టాఫ్ ఉన్నప్పటికీ ధోని గైడెన్స్, ఎక్స్‌పీరియెన్స్ సీఎస్‌కే విజయాల్లో కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. కాగా, పించ్ హిట్టర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి వివాహ వేడుకలకు ధోని హాజరయ్యాడు. అక్కడ సురేష్ రైనాతో కలసి అతడు మాస్ డ్యాన్స్ చేయడం వైరల్ అవుతోంది. ఎగురుతూ, విజిల్స్ వేస్తూ అతడు చేసిన సందడి మామూలుగా లేదు.


ఇవీ చదవండి:

ఒక్క చాన్స్ ప్లీజ్ అంటున్న చాహల్

లండన్‌కు గంభీర్.. స్కెచ్‌కు పిచ్చెక్కాల్సిందే

ఆ భారత స్టార్ నా ఫేవరెట్: మాళవిక

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2025 | 02:33 PM