Share News

Yuzvendra Chahal: ఒక్క చాన్స్ ప్లీజ్ అంటున్న చాహల్.. కోచ్ ఒప్పుకుంటాడా..

ABN , Publish Date - Mar 12 , 2025 | 01:48 PM

Punjab Kings: వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు. లాంగ్ స్పెల్స్‌ వేస్తూ టచ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాగే బ్యాట్‌ కూడా పట్టి భారీ షాట్లు బాదుతున్నాడు.

Yuzvendra Chahal: ఒక్క చాన్స్ ప్లీజ్ అంటున్న చాహల్.. కోచ్ ఒప్పుకుంటాడా..
Yuzvendra Chahal

టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భీకరంగా సాధన చేస్తున్నాడు. బంతి చేతపట్టి వరుసగా ఓవర్ల మీద ఓవర్లు వేస్తూ నెట్స్‌లో చెమటలు కక్కుతున్నాడు. అక్కడితో అతడు ఆగిపోలేదు. కాసేపు బ్యాట్ కూడా పట్టి భారీ షాట్లు బాదాడు. తెలివిగా సందుల్లో నుంచి బంతుల్ని పంపి బౌలర్లను రెచ్చగొట్టాడు. ఆ తర్వాత అతడు మాట్లాడుతూ.. ప్లీజ్.. ఒక్క చాన్స్ ఇవ్వమని హెడ్ కోచ్‌ను రిక్వెస్ట్ చేశాడు. మరి.. చాహల్ కోరిక ఏంటి.. దానికి కోచ్ ఒప్పుకుంటాడా.. లేదా.. అనేది ఇప్పుడు చూద్దాం..


చాన్స్ ఇస్తే చెలరేగుతా..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్‌కు త్వరలో తెరలేవనుంది. ఈ నేపథ్యంలో తన నయా టీమ్ పంజాబ్ కింగ్స్‌లో జాయిన్ అయ్యాడు స్పిన్నర్ చాహల్. ఆ టీమ్ ప్రాక్టీస్ సెషన్‌లో అతడు హల్‌చల్ చేశాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ కూడా సాధన చేస్తూ కనిపించాడు. ఎప్పటిలాగే జోకులు వేస్తూ ఇతర ఆటగాళ్లను నవ్వుల్లో ముంచెత్తాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన చాహల్.. కోచ్ పాంటింగ్‌ పేరును అందులో ప్రస్తావించాడు. ఓపెనింగ్ స్లాట్ ఖాళీగా ఉంటే చెప్పండి.. ఆ ప్లేస్‌లో వచ్చి దుమ్మురేపుతా అని చాహల్ క్యాప్షన్ పెట్టాడు.


సీక్రెట్ వెపన్..

చాహల్ బ్యాటింగ్ వీడియోపై సీక్రెట్ వెపన్ అంటూ పంజాబ్ కింగ్స్ కూడా ఫన్నీ క్యాప్షన్‌ పెట్టింది. ఈ వీడియోలో చాహల్ వేసిన జోకులు హైలైట్ అనే చెప్పాలి. మీ బౌలర్లను బాదిపారేస్తా.. దొంగ బౌలర్లు.. అంటూ అతడు చేసిన వ్యాఖ్యలు నవ్వులు తెప్పిస్తున్నాయి. కాగా, చాహల్‌ రిక్వెస్ట్‌కు పాంటింగ్ ఓకే చెప్పి.. ఓపెనర్‌గా దించితే ఈసారి కూడా పంజాబ్‌కు కప్పు రాదని నెటిజన్స్ ఫన్నీ ట్రోల్స్ చేస్తున్నారు. కాగా, ఐపీఎల్-2025కు ముందు నిర్వహించిన మెగా ఆక్షన్‌లో రూ.18 కోట్ల కళ్లుచెదిరే ధర చెల్లించి చాహల్‌ను సొంతం చేసుకుంది పంజాబ్ కింగ్స్.


ఇవీ చదవండి:

లండన్‌కు గంభీర్.. స్కెచ్‌కు పిచ్చెక్కాల్సిందే

ఆ భారత స్టార్ నా ఫేవరెట్: మాళవిక

పంత్-రైనాతో కలసి ధోని మాస్ డ్యాన్స్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2025 | 03:17 PM