Share News

Jasprit Bumrah: నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే.. బుమ్రాతో బీ కేర్‌ఫుల్

ABN , Publish Date - Jan 06 , 2025 | 03:49 PM

Team India: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ముగింపు నుంచి భారత క్రికెట్‌లో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను టీమ్‌లో నుంచి తీసేశారు. విరాట్ కోహ్లీపై కూడా నెక్స్ట్ వేటు ఖాయమనే హెచ్చరికలు పంపించారు. అయితే జస్‌ప్రీత్ బుమ్రా విషయంలో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది.

Jasprit Bumrah: నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే.. బుమ్రాతో బీ కేర్‌ఫుల్
Jasprit Bumrah

ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ముగింపు నుంచి భారత క్రికెట్‌లో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను టీమ్‌లో నుంచి తీసేశారు. విరాట్ కోహ్లీపై కూడా నెక్స్ట్ వేటు ఖాయమనే హెచ్చరికలు పంపించారు. అయితే జస్‌ప్రీత్ బుమ్రా విషయంలో బీసీసీఐ, భారత టీమ్ మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. రోహిత్ లాంటి తోపు సారథిని తీసేసి సిడ్నీ టెస్ట్‌లో బుమ్రాను కెప్టెన్ చేశారు. అక్కడితో ఆగకుండా త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీలోనూ అతడికే సారథ్య పగ్గాలు అప్పగించనున్నారని వినిపిస్తోంది. వచ్చే కొన్ని వారాల్లో జరిగే వైట్ బాల్ సిరీస్‌లకు బుమ్రాను దూరంగా ఉంచి.. నేరుగా చాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్‌గా పవర్స్ ఇచ్చి బరిలోకి దింపాలని భారత క్రికెట్ పెద్దలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.


రోహిత్ వారసుడిగా బుమ్రా!

చాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి దిగిపోవడమే గాక రిటైర్మెంట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఆల్రెడీ టీ20లకు గుడ్‌బై చెప్పిన హిట్‌మ్యాన్.. టెస్టుల్లో పూర్ పెర్ఫార్మెన్స్ నేపథ్యంలో రెడ్ బాల్ క్రికెట్‌కూ వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వయసు మీద పడటం, బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ పడిపోవడం, జట్టు వరుస ఓటముల నేపథ్యంలో వన్డేల నుంచి వైదొలగాలని భావిస్తున్నాడని సమాచారం. అందుకే అతడి వారసుడిగా బుమ్రా పేరు ప్రకటించాలని అనుకుంటున్నారట బీసీసీఐ పెద్దలు. అయితే బుమ్రాతో పెట్టుకుంటే నట్టేట మునిగినట్లేనని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి వాళ్లు సాలిడ్ రీజన్స్ కూడా చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..


గాయాలతో సావాసం..

బౌలింగ్‌లో బుమ్రాకు వంక పెట్టడానికి లేదు. ప్రస్తుత వరల్డ్ క్రికెట్‌లో అతడే తోపు బౌలర్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కెప్టెన్‌గానూ కొన్ని మ్యాచులతో తానేంటో అతడు ప్రూవ్ చేశాడు. అయితే వచ్చిన సమస్యల్లా బుమ్రా ఫిట్‌నెస్‌తోనే. గాయాలతో నిత్యం సావాసం చేస్తుంటాడు పేసుగుర్రం. వైవిధ్యమైన అతడి బౌలింగ్ శైలి వల్ల ఎప్పుడు ఇంజ్యురీ అవుతుందో చెప్పలేని పరిస్థితి. సిడ్నీ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేస్తూ గాయపడిన బుమ్రా.. ఎప్పటికి కోలుకుంటాడో క్లారిటీ లేదు. ఆల్రెడీ బ్యాక్ సర్జరీ చేయించుకున్న ఈ తోపు బౌలర్ కెరీర్‌ను ఎక్కువ కాలం పొడిగించుకోవాలంటే మ్యాచులు తగ్గించుకోవాలి, టీ20 లాంటి పొట్టి ఫార్మాట్లకే పరిమితమవడం బెటర్ అని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమ్‌కు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రతి మ్యాచ్ ఆడుతూ జట్టును ముందుకు నడిపించే కెప్టెన్ రోల్‌కు బుమ్రా ఎంతవరకు న్యాయం చేయగలడు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ అతడు ఫిట్‌నెస్‌పై వర్క్ చేసి ఫుల్ ఫిట్‌గా కంటిన్యూ అయితే సారథిని చేయడం సరైనదే. కానీ గాయాలు వెంటాడితే మాత్రం అతడ్ని కెప్టెన్ చేయాలనే ఆలోచనతో బీసీసీఐ నట్టేట మునుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


ఇవీ చదవండి:

రోహిత్, కోహ్లీ కాదు.. నా ఇన్‌స్పిరేషన్ అతడే: పంత్

చాహల్ సంసారంలో నిప్పులు పోశాడు.. ఎవరీ ప్రతీక్..

టీమిండియా ఆల్‌రౌండర్ రిటైర్మెంట్.. దేశవాళీల్లో ఇతనో లెజెండ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 06 , 2025 | 03:56 PM