Champions Trophy 2025: బల్లగుద్ది చెబుతున్నా.. ఆ టీమ్‌దే ట్రోఫీ: ఆస్ట్రేలియా లెజెండ్
ABN , Publish Date - Feb 17 , 2025 | 07:40 PM
Michael Clarke: చాంపియన్స్ ట్రోఫీని ఎవరు సొంతం చేసుకుంటారనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో ఆసీస్ దిగ్గజం మైకేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లదే కప్పు అంటూ జోస్యం పలికాడు.

చాంపియన్స్ ట్రోఫీకి టైమ్ దగ్గర పడటంతో ప్రిడిక్షన్స్ మొదలైపోయాయి. బరిలో ఉన్న 8 జట్లు కూడా బలంగా ఉండటం, బడా టీమ్స్ మధ్య కూడా బలాబలాల్లో అంతరం తక్కువే ఉండటంతో ఎవరు విజేతగా నిలుస్తారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. భారత్, ఇంగ్లండ్‌తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. ఆతిథ్య పాకిస్థాన్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ప్రిడిక్షన్స్ జోరుగా వైరల్ అవుతున్న ఈ తరుణంలో ఆసీస్ లెజెండ్ మైకేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి కప్పు కొట్టేది రోహిత్ సేనేనని అతడు బల్లగుద్ది చెబుతున్నాడు. దీనికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
టీమిండియాకు అతడే బలం!
‘చాంపియన్స్ ట్రోఫీలో భారత్ చాంపియన్‌గా నిలుస్తుందని అనుకుంటున్నా. కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌లోకి రావడం బాగుంది. అతడి ఫామ్ టీమిండియాను కప్పు రేసులో మరింత ముందుంచుతోంది. జట్టుకు అతడే పెద్ద బలం. కప్పు వాళ్లే సొంతం చేసుకుంటారని భావిస్తున్నా. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించే బ్యాటర్‌గానూ రోహిత్ నిలుస్తాడనేది నా నమ్మకం. బౌలింగ్‌లో టాప్ వికెట్ టేకర్‌గా ఇంగ్లండ్ స్టార్ సీమర్ జోఫ్రా ఆర్చర్ అవుతాడని అనుకుంటున్నా. టీమ్ పరంగా ఇంగ్లండ్‌కు టైటిల్ గెలిచే అవకాశాలు తక్కువే. కానీ ఆ టీమ్‌లో ఆర్చర్ ఒక సూపర్ స్టార్. ఈసారి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ట్రావిస్ హెడ్ నిలుస్తాడనుకుంటున్నా. అతడి బ్యాట్ నుంచి పరుగుల వరద ఖాయం’ అని క్లార్క్ చెప్పుకొచ్చాడు.
ఇవీ చదవండి:
భారత జెండాకు భయపడుతున్న పాక్.. ఇండియా అంటే ఆ మాత్రం ఉండాలి
ప్రాక్టీస్ మొదలుపెట్టిన క్రికెట్ గాడ్.. ఫ్యాన్స్‌కు పండగే
రోహిత్ తిరుగులేని వ్యూహం.. పక్కా స్కెచ్‌తో
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి