Share News

IND vs PAK: భారత జెండాకు భయపడుతున్న పాక్.. ఇండియా అంటే ఆ మాత్రం ఉండాలి

ABN , Publish Date - Feb 17 , 2025 | 07:26 PM

Champions Trophy 2025: రోహిత్ సేన బరిలోకి దిగడానికి ముందే పాకిస్థాన్ జట్టుకు ముచ్చెమటలు పడుతున్నాయి. మన జెండాను తలచుకొని ఆ టీమ్ వణికిపోతోంది. అసలేం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..

IND vs PAK: భారత జెండాకు భయపడుతున్న పాక్.. ఇండియా అంటే ఆ మాత్రం ఉండాలి
IND vs PAK

టీమిండియా పేరు చెబితేనే పాకిస్థాన్ వణుకుతోంది. రోహిత్ సేనతో మ్యాచ్ అంటేనే గడగడలాడుతోంది. మామూలు సిరీస్ అంటే ఏదో అనుకోవచ్చు. కానీ ఆడుతోంది ఐసీసీ టోర్నమెంట్‌లో. అందునా భారత్ తోపుగా పేరు తెచ్చుకున్న వన్డే ఫార్మాట్‌లో కావడంతో దాయాదికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఐసీసీ టోర్నీల్లో భారత్‌కు తమ మీద ఉన్న రికార్డులు చూసి ఆ టీమ్ వణుకుతోంది. అయితే మన టీమ్ బరిలోకి దిగకముందే పాక్‌ షేక్ అవుతోంది. భారత జెండాను చూసే ఆ టీమ్‌‌లో గుబులు మొదలైంది. అందుకే ఓ చెత్త పని చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..


జన్మలో బుద్ధి రాదు!

చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తోంది పాక్. అక్కడి కరాచీ స్టేడియంలో టోర్నీ మ్యాచులు జరగనున్నాయి. దీంతో మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయితే స్టేడియం మీద ఇతర అన్ని దేశాల జెండాలు రెపరెపలాడుతున్నా.. భారత త్రివర్ణ పతాకం మాత్రం కనిపించలేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ నుంచి బంగ్లాదేశ్ వరకు అన్ని దేశాల జెండాలు ఉన్నా భారత జెండా కనిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన టీమ్ అంటేనే వాళ్లకు వణుకు అంటూ అవాక్కులు చెవాక్కులు పేలుతున్నాయి. అయితే పాక్ బోర్డు మాత్రం దీన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తోంది. టోర్నీ నిర్వహిస్తున్నందున తమ దేశంతో పాటు ఐసీసీ, మ్యాచ్ ఆడే రెండు దేశాల ఫ్లాగ్స్ మాత్రమే ప్రదర్శించాలని అత్యున్నత బోర్డు సూచించిందని చెబుతోంది. ఇది విన్న నెటిజన్స్.. మీకు ఈ జన్మలో ఇక బుద్ధి రాదంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇప్పుడే ఇంత భయపడితే ఇంక గ్రౌండ్‌లో ఏం ఆడతారంటూ ఆ టీమ్ పరువు తీస్తున్నారు.

team india.jpg


ఇవీ చదవండి:

ప్రాక్టీస్ మొదలుపెట్టిన క్రికెట్ గాడ్.. ఫ్యాన్స్‌కు పండగే

రోహిత్ తిరుగులేని వ్యూహం.. పక్కా స్కెచ్‌తో

ధోని నుంచి రోహిత్ ఎరా వరకు.. డాక్యుమెంటరీ చూశారా..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 17 , 2025 | 09:19 PM