Mohammed Siraj: సిరాజ్‌కు బీసీసీఐ అన్యాయం.. నమ్మించి నట్టేట ముంచారు
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:06 PM
India Squad For Champions Trophy: హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు అన్యాయం జరిగింది. టీమిండియాకు ఇన్నాళ్లుగా అందిస్తున్న సేవలకు ఫలితమే లేకుండా పోయింది. యంగ్‌స్టర్స్ మీద నమ్మకం ఉంచిన బీసీసీఐ.. మియా మ్యాజిక్ పై భరోసా ఉంచలేదు.

మహ్మద్ సిరాజ్.. టీమిండియాకు చాలా కీలక ఆటగాడు. గత కొన్నేళ్లుగా భారత జట్టు పేస్ దళంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ప్లేయర్. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థుల ఆట కట్టిస్తూ జట్టుకు ఎన్నో మ్యాచుల్లో ఒంటిచేత్తో విజయాలు అందించాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి హవాలో అతడికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ కొన్నాళ్ల కింద వరకు అతడు వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ బౌలర్‌గా ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియదు. మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ప్లేయర్‌గా ఉన్న సిరాజ్ ప్రతిభ, సేవల్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. అలాంటోడికి అన్యాయం జరిగింది. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం..
షమి ఇన్.. సిరాజ్ ఔట్!
ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును తాజాగా ప్రకటించారు. సారథి రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్క్వాడ్‌ను అనౌన్స్ చేశారు. 15 మంది సభ్యుల ఈ జట్టుకు హిట్‌మ్యాన్ కెప్టెన్‌గా, శుబ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. గాయంతో ఇబ్బంది పడుతున్న జస్‌ప్రీత్ బుమ్రా ఈ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. సర్జరీ తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తున్న వెటరన్ పేసర్ మహ్మద్ షమి కూడా ఈ స్క్వాడ్‌లో ఉన్నాడు. కానీ గత కొన్నాళ్లుగా వన్డే టీమ్‌లో కీలక పాత్ర పోషిస్తున్న మహ్మద్ సిరాజ్‌ను మాత్రం సెలెక్ట్ చేయలేదు. దీంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ఇదా ప్రతిఫలం?
వన్డేల్లో నంబర్ వన్ బౌలర్‌గా కొన్నాళ్లు అందర్నీ హడలెత్తించాడు సిరాజ్. అటు టీ20లు, ఇటు టెస్టుల్లోనూ అదరగొడుతూ వచ్చాడు. ఫామ్, ఫిట్‌నెస్.. ఇలా ఏది చూసుకున్నా అతడికి అతడే సాటిలా ఉన్నాడు. అలాంటోడ్ని చాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేయకపోవడం వివాదాస్పదంగా మారింది. వన్డే టీమ్‌లో ఇన్నాళ్లూ కంటిన్యూ చేసి చివరికి ఇలా హ్యాండ్ ఇవ్వడం ఏంటంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అతడ్ని నమ్మించి మోసం చేశారంటూ ఫైర్ అవుతున్నారు. సిరాజ్ పడిన కష్టానికి ఇదా ప్రతిఫలం? అని క్వశ్చన్ చేస్తున్నారు. బీసీసీఐ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. జట్టులోకి సిరాజ్‌కు చోటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు.. వాళ్లకు నో చాన్స్
ఇష్టం ఉన్నా రంజీలు ఆడలేకపోతున్న కోహ్లీ.. అడ్డుకుంటోంది ఎవరు..
సీఎస్‌కే బౌలర్ మ్యాజికల్ డెలివరీ.. బంతిని బొంగరంలా తిప్పేశాడు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి