Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన.. బుమ్రా ఫ్యూచర్ తేల్చేశారు
ABN , Publish Date - Jan 18 , 2025 | 03:23 PM
India Squad For CT2025: టీమిండియా అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌ను తాజాగా ప్రకటించింది బీసీసీఐ. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 15 మందితో కూడిన స్క్వాడ్‌ను అనౌన్స్ చేసింది. మరి.. ఇందులో పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నాడా? లేడా? అనేది ఇప్పుడు చూద్దాం..

ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో తలపడే భారత జట్టును తాజాగా ప్రకటించింది భారత క్రికెట్ బోర్డు. సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ కలసి స్క్వాడ్‌ను అనౌన్స్ చేశారు. 15 మందితో కూడిన ఈ జట్టును హిట్‌మ్యాన్ సారథిగా ముందుండి నడిపించనున్నాడు. యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ టీమ్‌లో ఇంకా ఏయే ఆటగాళ్లు ఉన్నారు? పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా స్క్వాడ్‌లో ఉన్నాడా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..
ఆ ఇద్దరికీ నో చాన్స్!
చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఓపెనర్లుగా ఉన్నారు. వీళ్లతో పాటు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, స్టైలిష్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ టాపార్డర్‌లో ఉన్నారు. పేస్ ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను తీసుకున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ఎంపికయ్యారు. ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను తీసుకున్నారు. మహ్మద్ షమి, అర్ష్‌దీప్ సింగ్‌తో కలసి పేస్ అటాక్‌ను నడిపించనున్నాడు జస్‌ప్రీత్ బుమ్రా. ఈ జట్టులో హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కలేదు. రంజీల్లో అదరగొడుతున్న కరుణ్ నాయర్‌నూ సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు.
ఇవీ చదవండి:
ఇష్టం ఉన్నా రంజీలు ఆడలేకపోతున్న కోహ్లీ.. అడ్డుకుంటోంది ఎవరు..
సీఎస్‌కే బౌలర్ మ్యాజికల్ డెలివరీ.. బంతిని బొంగరంలా తిప్పేశాడు
ఐపీఎల్‌కు రోహిత్-కోహ్లీ దూరం.. స్టార్లపై ఉక్కుపాదం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి