Virat Kohli: ఇష్టం ఉన్నా రంజీలు ఆడలేకపోతున్న కోహ్లీ.. అడ్డుకుంటోంది ఎవరు..
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:35 PM
Team India: టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆల్రెడీ ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడని ఇక బరిలోకి దిగడమే తరువాయి అని అంతా అనుకున్నారు. ఈ తరుణంలో హఠాత్తుగా రంజీల నుంచి కింగ్ తప్పుకున్నాడని సమాచారం.
టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌లో ఉన్నాడు. అతడి బ్యాటింగ్‌లో కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు. మునుపటి ఉత్సాహం, విశ్వాసం లోపిస్తున్నాయి. అందుకే తన బలమైన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ షాట్ ఆడి వరుసగా 8 సార్లు ఔట్ అయ్యాడు. అయితే వైఫల్యాల నుంచి బయటపడాలని భావిస్తున్న విరాట్.. అందుకు దేశవాళీల బాట పట్టాలని భావించాడు. రంజీ ట్రోఫీ మ్యాచులతో తిరిగి ఫామ్‌ను అందుకోవాలని అనుకున్నాడు. అందుకు తగ్గట్లే ఢిల్లీ జట్టుతో కలసి ప్రాక్టీస్ కూడా ఆరంభించాడు. అయితే హఠాత్తుగా రంజీలకు అతడు దూరమనే వార్త బయటకు వచ్చింది. మరి.. ఫుల్ ఫిట్‌గా ఉన్న కోహ్లీ.. రంజీల్లో ఆడాలని అనుకున్నా ఎందుకు దూరమయ్యాడనేది ఇప్పుడు చూద్దాం..
అదే రీజన్!
రంజీల్లో ఆడాలని కోహ్లీ ఎంతో ఆసక్తి చూపించాడు. 2012 నుంచి ఈ టోర్నమెంట్‌కు దూరంగా ఉన్న విరాట్.. తిరిగి ఫామ్‌ను అందుకునేందుకు ఇదే సరైన వేదిక అని భావించాడు. అందుకోసం ప్రాక్టీస్ మొదలుపెట్టి హుషారుగా సిద్ధమయ్యాడు. అయితే గాయం కారణంగా అతడు ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. మెడ నొప్పి కారణంగా ఈ టోర్నీలో ఆడలేనంటూ భారత క్రికెట్ బోర్డుకు కోహ్లీ సమాచారం అందజేశాడని తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టైమ్‌లోనే ఈ నొప్పితో విరాట్ బాధపడ్డాడట. అక్కడ ఎలాగోలా ఆడేసిన కింగ్.. సిడ్నీ టెస్ట్ ముగిసిన 3 రోజుల తర్వాత జనవరి 8న ఇంజక్షన్ తీసుకున్నాడని బీసీసీఐ వర్గాల సమాచారం.
ఆఖరి క్షణంలో..!
మెడనొప్పి కారణంగా సౌరాష్ట్రతో ఢిల్లీ ఆడే తదుపరి మ్యాచ్‌కు కోహ్లీ దూరమయ్యాడు. మరో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా మోచేయి నొప్పి వల్ల కర్ణాటక ఆడే నెక్స్ట్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండనని బోర్డుకు స్పష్టం చేశాడని తెలుస్తోంది. రాహుల్ సంగతి అటుంచితే.. కోహ్లీ రంజీలు ఆడకపోవడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అతడికి ఆడాలనే అనుకున్నా ఎవరైనా కావాలనే అడ్డుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నటి వరకు ప్రాక్టీస్ చేస్తూ హుషారుగా ఉన్నోడు ఒక్కసారిగా గాయం కారణంతో వైదొలగడం ఏంటని సందేహిస్తున్నారు. అయితే మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా లాంటి స్టార్లంతా రంజీ బరిలోకి దిగేందుకు ప్రిపేర్ అవుతున్నారు. మరి.. విరాట్ చివరి క్షణంలో రంజీల నుంచి వైదొలగడానికి గాయమే కారణమా? లేదా అతడ్ని ఎవరైనా ఆపేశారా? అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి.
ఇవీ చదవండి:
సీఎస్‌కే బౌలర్ మ్యాజికల్ డెలివరీ.. బంతిని బొంగరంలా తిప్పేశాడు
ఐపీఎల్‌కు రోహిత్-కోహ్లీ దూరం.. స్టార్లపై ఉక్కుపాదం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి