PV Sindhu : సింధుకు చుక్కెదురు
ABN , Publish Date - Jan 18 , 2025 | 05:08 AM
సొంతగడ్డపై టైటిల్‌తో సత్తా చాటాలనుకున్న స్టార్ షట్లర్ పీవీ సింధుకు చుక్కెదురైంది. ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ఫైనల్లోనే

సెమీస్‌కు సాత్విక్ జోడీ
ఇండియా ఓపెన్
న్యూఢిల్లీ: సొంతగడ్డపై టైటిల్‌తో సత్తా చాటాలనుకున్న స్టార్ షట్లర్ పీవీ సింధుకు చుక్కెదురైంది. ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ఫైనల్లోనే వెనుదిరిగింది. కాగా, పురుషుల డబుల్స్‌లో స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి టోర్నీలో భారత్ ఆశలను సజీవంగా ఉంచింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో మాజీ చాంపియన్ సింధు 9-21, 21-19, 17-21తో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గ్రెగోరియా మరిస్కా (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలైంది. 2017లో ఇండియా ఓపెన్ టైటిల్ నెగ్గిన సింధు.. ఆ మరుసటి ఏడాది రన్నర్‌పగా నిలిచింది. కాగా, పురుషుల సింగిల్స్ బరిలో మిగిలిన ఏకైక ఆటగాడు కిరణ్ జార్జ్ 13-21, 19-21తో చైనా షట్లర్ వెంగ్ హాంగ్‌యాంగ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్/చిరాగ్ ద్వయం 21-10, 21-17తో కొరియా జోడీ కాంగ్ మిన్ హ్యూక్/హో జిన్‌ను చిత్తుచేసి సెమీస్ చేరింది. ఫైనల్ బెర్త్ కోసం మలేసియా జంట గో జె ఫె/ఇజుద్దీన్ కాన్‌తో సాత్విక్ ద్వయం తలపడనుంది.