IND vs PAK: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్‌కు కోలుకోలేని షాక్.. ఇక సరెండరే
ABN , Publish Date - Feb 20 , 2025 | 01:39 PM
Champions Trophy 2025: టీమిండియాతో మ్యాచ్‌కు రెడీ అవుతున్న పాకిస్థాన్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఆ జట్టు భారత్ ముందు సరెండర్ అవడం తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు.
చాన్నాళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీ రూపంలో మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టోర్నీ ఆరంభానికి ముందే భారత జెండా ప్రదర్శన విషయంలో విమర్శలపాలైంది దాయాది. ఆ తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఘోరంగా ఓటమిపాలైంది. న్యూజిలాండ్‌తో జరిగిన టోర్నీ ఓపెనర్‌లో 60 పరుగుల తేడాతో చిత్తయింది రిజ్వాన్ సేన. దీంతో పోటీలో నిలవాలంటే తదుపరి భారత్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ తరుణంలో ఆ టీమ్‌కు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
అసలైనోడు దూరం!
సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉన్న పాక్ స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ మొత్తం చాంపియన్స్ ట్రోఫీకి దూరమైనట్లు సమాచారం. గాయం కారణంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ మధ్యలో నుంచి తప్పుకున్న అతడు.. బ్యాటింగ్ టైమ్‌లో మళ్లీ గ్రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. ఇంజ్యురీ ఇంకా నయం కాకపోవడంతో పూర్తి టోర్నమెంట్‌కు దూరమయ్యాడని వినిపిస్తోంది. టీమిండియాతో ఫిబ్రవరి 23వ తేదీన జరిగే తదుపరి మ్యాచ్‌లో అతడు ఆడబోవట్లేదని పాక్ క్రికెట్ వర్గాల సమాచారం. జమాన్ దుబాయ్ ఫ్లైట్ ఎక్కడం లేదని రూమర్స్ వస్తున్నాయి. అతడి గాయం తీవ్రతపై పాక్ బోర్డు కొంత స్పష్టత ఇచ్చింది. అతడ్ని వైద్య పరీక్షల కోసం తరలిస్తున్నామని, త్వరలోనే పూర్తి అప్‌డేట్ ఇస్తామని చెప్పుకొచ్చింది. కానీ దుబాయ్ విమానం ఎక్కుతాడా? లేదా? అనేది మాత్రం పేర్కొనలేదు.
రీప్లేస్‌మెంట్ ఎలా?
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పూర్తి స్థాయిలో ఫీల్డింగ్ చేయలేకపోయిన ఫఖర్ జమాన్.. బ్యాటింగ్ మాత్రం కంటిన్యూ చేశాడు. ఫోర్త్ డౌన్‌లో దిగిన స్టార్ బ్యాటర్ 41 బంతుల్లో 24 పరుగులు చేశాడు. మంచి స్టార్ట్ దొరికినా దాన్ని భారీ ఇన్నింగ్స్‌గా మలచలేకపోయాడు. ఆఖర్లో ఖుష్‌దిల్ షా (49 బంతుల్లో 69) అదరగొట్టినా.. మిగతా బ్యాటర్లు ఫెయిల్ అవడంతో పాక్‌కు భారీ ఓటమి తప్పలేదు. ఫఖర్ జమాన్ లాంటి అనుభవం కలిగిన ఆటగాడు దూరమవడం పాక్‌కు గట్టి ఎదురుదెబ్బే. టీమిండియాతో మ్యాచ్‌లో అతడు లేని లోటును దాయాది ఎలా భర్తీ చేస్తుందో చూడాలి.
ఇవీ చదవండి:
దిగొచ్చిన పాక్.. స్టేడియంలో భారత జెండా
గిల్ @:1 ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి