Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీకి ఏకంగా 8 మంది స్టార్లు దూరం.. కమిన్స్, ఫెర్గూసన్ సహా..
ABN , Publish Date - Feb 09 , 2025 | 02:12 PM
Pat Cummins: చాంపియన్స్ ట్రోఫీకి కౌంట్‌డౌన్ దగ్గర పడుతోంది. మరో 10 రోజుల్లో వన్డే ఫార్మాట్‌లో వరల్డ్ కప్ తర్వాత అతిపెద్ద టోర్నమెంట్ స్టార్ట్ కానుంది. అయితే ఈ సారి ప్యాట్ కమిన్స్ సహా ఏకంగా 8 మంది స్టార్లు ఈ టోర్నీని మిస్ కానున్నారు.

వన్డేల్లో వరల్డ్ కప్ తర్వాత అతిపెద్ద టోర్నమెంట్‌గా చాంపియన్స్ ట్రోఫీని చెప్పాలి. ఎంతో ఘనచరిత్ర కలిగిన ఈ ట్రోఫీకి టైమ్ అయింది. మరో 10 రోజుల్లో చాంపియన్స్ ట్రోఫీ నయా ఎడిషన్ స్టార్ట్ కానుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సన్నద్ధం అవుతున్నాయి. ఎలాగైనా కప్పును ఎగరేసుకుపోవాలని ప్లాన్స్ చేస్తున్నాయి. అందుకు తగ్గ వ్యూహ రచనలు, ప్రాక్టీస్ లాంటి వాటిల్లో బిజీబిజీగా ఉన్నాయి. అయితే ఈ టోర్నీకి ఏకంగా 8 మంది స్టార్లు దూరం కానున్నారు. వాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
ప్యాట్ కమిన్స్
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం కష్టమని ఆ జట్టు కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ అన్నాడు. చీలమండ గాయం మానకపోవడంతో అతడు ఇంకా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టలేదని తెలిపాడు. టాప్ స్టార్స్‌లో ఒకడు, ఆసీస్ లాంటి బలమైన జట్టు సారథి లేకపోతే టోర్నీలో ఆడియెన్స్ పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవుతారు.
జస్‌ప్రీత్ బుమ్రా
టీమిండియా టాప్ గన్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి కారణంగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆడట్లేదు. అటు ఐసీసీ డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. ఇటు బుమ్రా ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ లేదు. దీంతో అతడు మెగా టోర్నీకి మిస్ అవడం ఖాయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
జోష్ హేజల్‌వుడ్
ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హేజల్‌వుడ్ కూడా గాయంతో బాధపడుతున్నాడు. అతడు చాంపియన్స్ ట్రోఫీలో ఆడేది ఇంకా గ్యారెంటీ లేదు. ఒకవేళ ఇంజ్యురీ నుంచి రికవర్ అయి ప్రాక్టీస్ స్టార్ట్ చేసినా.. గాయం తిగరబెడితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.
మిచెల్ మార్ష్
కంగారూ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ కూడా ఇంజ్యురీ కారణంగా చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. అతడు లేకపోతే అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ మీద కూడా కొంతమేర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.
మార్కస్ స్టొయినిస్
ఆసీస్ మరో ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ ఇటీవలే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌కు ఎంపికైన నెల రోజుల తర్వాత తన నిర్ణయాన్ని అతడు వెల్లడించాడు. స్టొయినిస్‌తో కలిపి మొత్తం నలుగురు ఆసీస్ స్టార్లు మెగా టోర్నీకి దూరం కానున్నారు.
లాకీ ఫెర్గూసన్
న్యూజిలాండ్ పేస్ గన్ ఫెర్గూసన్ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఇంకా అతడు పూర్తిగా కోలుకోకపోవడంతో చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం అనుమానంగా మారింది.
ఆన్రిచ్ నోకియా
సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ నోకియా వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. అతడు ఇంకా కోలుకోకపోవడంతో మెగా టోర్నీలో ఆడడని తేలిపోయింది.
సయీమ్ అయూబ్
పాకిస్థాన్ యంగ్ ఓపెనర్ సయీమ్ అయూబ్ చీలమండ గాయంతో ఇబబ్బంది పడుతున్నాడు. ఇదే కారణంతో అతడు చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు.
ఇవీ చదవండి:
టీమిండియాను రెచ్చగొడుతున్న పాక్ ప్రధాని.. ఇంత ఓవరాక్షన్ అవసరమా..
సీఎస్కే స్టార్‌కు గాయం.. మ్యాచ్ మధ్యలోనే రక్తం కక్కుకొని..
ఇక నుంచి.. జూనియర్లకు నజరానాల్లేవ్!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి