Share News

Rohit Sharma-AB De Villiers: రోహిత్‌ను ఎందుకు విమర్శిస్తారు.. డివిలియర్స్ కామెంట్స్

ABN , Publish Date - Mar 13 , 2025 | 04:52 PM

Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ లాంటి బడా ఐసీసీ టోర్నమెంట్‌లో భారత్‌ను విజేతగా నిలపడంతో హిట్‌మ్యాన్ ఖుషీగా ఉన్నాడు.

Rohit Sharma-AB De Villiers: రోహిత్‌ను ఎందుకు విమర్శిస్తారు.. డివిలియర్స్ కామెంట్స్
Rohit Sharma

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు గేర్లు మార్చే పనిలో ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నయా సీజన్‌కు సమయం దగ్గర పడుతుండటంతో హిట్‌మ్యాన్ వన్డేల నుంచి టీ20లకు షిఫ్ట్ అయ్యే పనిలో పడ్డాడు. బౌండరీలు, సిక్సుల వర్షంలో ప్రత్యర్థులను ముంచెత్తాలని చూస్తున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను విజేతగా నిలిపిన రోహిత్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇదే జోరులో క్యాష్ రిచ్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు మరో కప్పు అందించాలని వ్యూహాలు పన్నుతున్నాడు. ఈ తరుణంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అతడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ను ఎందుకు విమర్శిస్తారని ఏబీడీ సీరియస్ అయ్యాడు.


నో చాన్స్

రోహిత్ సారథ్యంపై కొందరు అనవసర విమర్శలు చేస్తుంటారని.. కానీ అది సరికాదంటూ ఫైర్ అయ్యాడు డివిలియర్స్. కెప్టెన్సీ విషయంలో అతడు ఏ తప్పూ చేయట్లేదని.. విమర్శకులకు అసలు చాన్సే ఇవ్వట్లేదన్నాడు. హిట్‌మ్యాన్‌ను క్రిటిసైజ్ చేయడానికి ఒక్క రీజన్ కూడా లేదన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇతర సారథులతో పోలిస్తే రోహిత్‌ రికార్డు చాలా మెరుగ్గా ఉందని.. బ్యాటర్‌గానూ అదరగొడుతున్నాడని మెచ్చుకున్నాడు డివిలియర్స్.


ఒక్క రీజన్ లేదు

‘రోహిత్‌ను విమర్శంచడానికి ఒక్క కారణమూ లేదు. కెప్టెన్‌గా అతడి విన్నింగ్ పర్సంటేజ్ 74 శాతం. అతడు మరింత కాలం ఆడితే ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ వన్డే కెప్టెన్స్‌లో ఒకడిగా నిలుస్తాడు. తాను రిటైర్ కావడం లేదని స్వయంగా రోహితే అన్నాడు. అయినా అతడు ఎందుకు రిటైర్ అవ్వాలి.. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా దుమ్మురేపుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లోనూ 76 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఎంత టెన్షన్ ఉన్నా తుదిపోరులో మంచి నిర్ణయాలతో జట్టును విజయపథంలో నడిపించాడు’ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. రోహిత్‌లో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉందన్నాడు సఫారీ లెజెండ్. అతడు ఇలాగే అదరగొట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.


ఇవీ చదవండి:

రోహిత్‌పై ధోనీకి ఎందుకంత కోపం

సీఎస్‌కే క్రేజీ రికార్డ్

అబిద్‌ అలీ కన్నుమూత

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 13 , 2025 | 04:59 PM