Rohit-Dhoni: రోహిత్‌పై ధోనీకి ఎందుకంత కోపం.. ఇలాగేనా రియాక్ట్ అయ్యేది..
ABN , Publish Date - Mar 13 , 2025 | 04:03 PM
IPL 2025: టీమిండియా స్టార్లంతా ఇప్పుడు ఐపీఎల్ హడావుడిలో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు చాంపియన్స్ ట్రోఫీలో ఆడుతూ వచ్చిన ఆటగాళ్లు.. ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌తో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. భారత సారథి రోహిత్ శర్మ సక్సెస్‌ను మాహీ ఓర్వలేకపోతున్నాడని ఆరోపిస్తున్నారు. చాంపియన్స్ ట్రోఫీ-2025లో మెన్ ఇన్ బ్లూను విజేతగా నిలిపిన హిట్‌మ్యాన్‌ను చూసి అతడు తట్టుకోలేకపోతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఎయిర్‌పోర్ట్‌లో అతడు వ్యవహరించిన తీరు, రోహిత్ గురించి అడిగినప్పుడు స్పందించిన విధానాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఫైర్ అవుతున్నారు. మరి.. నిజంగానే రోహిత్ అంటే ధోనీకి పడదా.. అసలు మాహీ చేసిన తప్పేంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..
నిజంగానే ఓర్వట్లేదా..
పించ్ హిట్టర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు డెహ్రాడూన్‌కు వెళ్లాడు ధోని. అయితే అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో అతడికి రిపోర్టర్ల నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడంపై మీరేం అనుకుంటున్నారని ఓ విలేకరి మాహీని అడిగాడు. అయితే దీనికి సమాధానం చెప్పేందుకు అతడు నిరాకరించాడు. పక్కకు జరగండి అనేలా చేతితో సీరియస్‌గా సంజ్ఞలు చేశాడు. ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్స్.. రోహిత్ విజయాన్ని ధోని ఓర్వలేకపోతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
అదంతా మర్చిపోయారా..
కెప్టెన్‌గా రోహిత్ తనను మించిపోతున్నాడు.. కప్పులు, రికార్డుల, క్రేజ్ ఇలా అన్నింటా దాటేస్తున్నాడనే ఈర్ష్య, అసూయతోనే ధోని అలా రియాక్ట్ అయ్యాడని నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై ఇతర నెటిజన్స్ మరో విధంగా స్పందిస్తున్నారు. మాహీ సపోర్ట్ లేనిదే హిట్‌మ్యాన్ ఈ స్థాయికి చేరుకునేవాడా అని చెబుతున్నారు. కెరీర్ ఆరంభంలో అధిక బరువు, ఫిట్‌నెస్, ఫామ్ కోల్పోవడం లాంటి ఇష్యూస్‌తో సతమతమవుతున్న రోహిత్‌కు ధోని దన్నుగా నిలిచాడని అంటున్నారు. చాంపియన్స్ ట్రోఫీ-2013లో అతడ్ని ఓపెనర్‌గా ప్రమోట్ చేశాడని గుర్తుచేస్తున్నారు. హిట్‌మ్యాన్ ఎంత ఎదిగితే ధోని అంత సంతోషిస్తాడని.. ఇలాంటి చీప్ కామెంట్స్, చెత్త కాంట్రవర్సీలు ఆపాలని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
సీఎస్‌కే క్రేజీ రికార్డ్.. హిస్టరీలో ఫస్ట్ టీమ్‌గా..
క్రికెట్‌కు బంగ్లా స్టార్ గుడ్‌బై
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి