CSK: సీఎస్‌కే క్రేజీ రికార్డ్.. ఐపీఎల్ హిస్టరీలో ఫస్ట్ టీమ్‌గా..
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:10 PM
IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరో అరుదైన ఘనతను అందుకుంది. ఐపీఎల్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని అఛీవ్‌మెంట్‌కు రీచ్ అయితే సీఎస్‌కే. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ అనగానే ఠక్కున గుర్తుకొచ్చే టీమ్ చెన్నై సూపర్ కింగ్స్. క్యాష్ రిచ్ లీగ్‌లో చాలా జట్లు ఉన్నప్పటికీ సీఎస్‌కేకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ట్రోఫీలు గెలవడం ఆ జట్టుకు అలవాటుగా మారింది. మహేంద్ర సింగ్ ధోని లాంటి లెజెండ్ ఇంకా ఆడుతుండటం కూడా చెన్నై క్రేజ్ ఇంకా కొనసాగడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అలాంటి సీఎస్‌కే ఓ అరుదైన ఫీట్ నమోదు చేసింది. బరిలోకి దిగి రికార్డుల మోత మోగించే ధోని జట్టు.. ఇప్పుడు ఎవరికీ సాధ్యం కాని క్రేజీ రికార్డు క్రియేట్ చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
రికార్డ్ సెట్
మైదానంలో రికార్డుల దుమ్ముదులిపే చెన్నై సూపర్ కింగ్స్.. ఈసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 17 మిలియన్ల ఫాలోవర్లను కలిగిన తొలి ఐపీఎల్ జట్టుగా మాహీ సేన రికార్డు క్రియేట్ చేసింది. క్యాష్ రిచ్ లీగ్ హిస్టరీలో ఏ టీమ్‌కూ ఇన్‌స్టాలో ఇన్ని మిలియన్ల ఫాలోవర్లు లేరు. ఆ రకంగా కొత్త సీజన్ ఆరంభానికి ముందే చెన్నై వార్తల్లో నిలిచింది. ఇది సీఎస్‌కే ఫ్యాన్ ఫాలోయింగ్‌కు బిగ్ ఎగ్జాంపుల్ అని నెటిజన్స్ అంటున్నారు. కాగా, నయా సీజన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న ధోని.. రిషబ్ పంత్ సోదరి సాక్షి మ్యారేజ్ ఉండటంతో ట్రెయినింగ్ క్యాంప్ నుంచి నేరుగా ముస్సోరికి వెళ్లిపోయాడు. అక్కడ జరుగుతున్న వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ, ఈలలు వేస్తూ రచ్చ రచ్చ చేశాడు ధోని. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి:
క్రికెట్‌కు బంగ్లా స్టార్ గుడ్‌బై
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి