గౌతీ..కొత్త ట్రెండ్?
ABN , Publish Date - Mar 13 , 2025 | 04:24 AM
గతంలో భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్‌లుగా పనిచేసినవారికి భిన్న శైలిలో వెళ్లేందుకు గౌతమ్ గంభీర్ సిద్ధమవుతున్నాడట. ఇకనుంచి సీనియర్ జట్టు బాధ్యతలు లేనప్పుడు భారత ‘ఎ’ జట్టుతో పాటు...

‘ఎ’ జట్టు టూర్లకూ వెళ్లేందుకు సిద్ధం
న్యూఢిల్లీ: గతంలో భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్‌లుగా పనిచేసినవారికి భిన్న శైలిలో వెళ్లేందుకు గౌతమ్ గంభీర్ సిద్ధమవుతున్నాడట. ఇకనుంచి సీనియర్ జట్టు బాధ్యతలు లేనప్పుడు భారత ‘ఎ’ జట్టుతో పాటు విదేశీ పర్యటనలకు వెళ్లాలని భావిస్తున్నాడు. భారత రిజర్వు బెంచ్ బలంపై అవగాహనకు వచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గతేడాది సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో, ఆ తర్వాత ఆస్ర్టేలియా పర్యటనలో వైఫల్యాల దరిమిలా టెస్టు క్రికెట్‌లో భారత్‌ను గాడిలో పెట్టే దిశగా గంభీర్ తన ప్రయత్నాలను తీవ్రతరం చేయనున్నాడట. అందుకే ‘ఎ’ జట్టు విదేశీ టూర్ల సంఖ్యను పెంచాలని బోర్డుకు గంభీర్ సూచించాడు. ప్రస్తుతం భారత ‘ఎ’ జట్టు చీఫ్ కోచ్‌గా సితాంశు కోటక్ వ్యవహరిస్తున్నాడు.
ఇవీ చదవండి:
ర్యాంకింగ్స్.. టాప్-5లో ముగ్గురు భారత స్టార్లు
ధోని కొత్త అవతారం.. కప్పు కోసం..
లండన్‌కు గంభీర్.. స్కెచ్‌కు పిచ్చెక్కాల్సిందే
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి