Share News

క్రికెట్‌కు మహ్మదుల్లా గుడ్‌బై

ABN , Publish Date - Mar 13 , 2025 | 04:22 AM

బంగ్లాదేశ్‌ వెటరన్‌ బ్యాటర్‌, 39 ఏళ్ల మహ్మదుల్లా అంతర్జాతీయ క్రికెట్‌కు బుధవారం రిటైర్మెంట్‌ ప్రకటించాడు. మహ్మదుల్లా తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో...

క్రికెట్‌కు మహ్మదుల్లా గుడ్‌బై

ఢాకా: బంగ్లాదేశ్‌ వెటరన్‌ బ్యాటర్‌, 39 ఏళ్ల మహ్మదుల్లా అంతర్జాతీయ క్రికెట్‌కు బుధవారం రిటైర్మెంట్‌ ప్రకటించాడు. మహ్మదుల్లా తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 239 వన్డేలు, 50 టెస్ట్‌లు, 141 టీ20లు ఆడాడు. మూడు వన్డే వరల్డ్‌ కప్‌లలో సెంచరీలు చేసిన బంగ్లా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2021లో టెస్ట్‌లకు, 2024లో టీ20లకు మహ్మదుల్లా వీడ్కోలు పలికాడు. ఇక..వన్డేల్లో 5698, టెస్ట్‌ల్లో 2914, టీ20ల్లో 2444 రన్స్‌ చేశాడు. ఆఫ్‌ స్పిన్నర్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి 166 వికెట్లు పడగొట్టాడు.

Updated Date - Mar 13 , 2025 | 04:22 AM