Elephant Viral Video: రోడ్డు మధ్యలో ఏనుగు.. ఎదురుగా వచ్చిన స్కూటరిస్ట్.. చివరకు..
ABN , Publish Date - May 10 , 2025 | 11:00 AM
ఓ పెద్ద ఏనుగు అడవి మధ్యలో రోడ్డు పైకి వచ్చి నిలబడి ఉంటుంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు ఏనుగు చూసి భయంతో వేగంగా ముందుకు వెళ్లి ఆగుతాడు. ఆ తర్వాత ఏనుగు రోడ్డు మధ్యలోకి వచ్చి నిలబడుతుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

‘‘ఒక్కసారి కమిట్ అయితే.. నా మాట నేనే వినను’’.. అనే సినిమా డైలాగ్ ఏనుగులకు సరిగ్గా సరిపోతుంది. ఒక్కసారి తిక్కరేగితే వాటి మాట అవే వినవు మరి. అప్పటిదాకా శాంతంగా కనిపించే ఏనుగులు.. ఉన్నట్టుండి అందరికీ షాక్ ఇస్తుంటాయి. చెట్టూ.. పుట్టా.. ఇల్లూ.. వాహనాలూ.. ఇలా దేన్నీ వదలకుండా సర్వనాశనం చేస్తుంటాయి. మరికొన్నిసార్లు రోడ్డుపై వాహనదారులను బెదిరించి మరీ ఆహార పదార్థాలను లాక్కుంటుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఏనుగు రోడ్డు మధ్యలో నిలబడి ఉంది. అదే సమయంలో ఓ స్కూటరిస్ట్ అటుగా వచ్చాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద ఏనుగు అడవి మధ్యలో రోడ్డు పైకి వచ్చి నిలబడి ఉంటుంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు ఏనుగు చూసి భయంతో (Elephant tried to attack scooterist) వేగంగా ముందుకు వెళ్లి ఆగుతాడు. ఆ తర్వాత ఏనుగు రోడ్డు మధ్యలోకి వచ్చి నిలబడుతుంది.
Woman Viral Video: వాగుపై విన్యాసాలు చేస్తూ రీల్స్.. చివరకు ఈ యువతికి ఏమైందో చూస్తే..
ఇంతలో మరో వ్యక్తి స్కూటీపై వస్తుంటాడు. అయితే ఏనుగును చూసి దూరంగా ఆగిపోతాడు. అతన్ని గమనించిన ఏనుగు.. పరుగెత్తుకుంటూ దగ్గరికి వెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే వెంటనే అప్రమత్తమైన అతను.. స్కూటీని వేగంగా నడుపుతూ (Scooterist escapes from elephant) రోడ్డు పక్కగా వెళ్లి తప్పించుకుంటాడు. అయితే ఆ తర్వాత ఏనుగు అక్కడే నిలబడిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
Viral Video: టెక్నిక్ మామూలుగా లేదుగా.. కాలువలో పడిపోయిన డబ్బులను ఎలా తీశాడో చూడండి..
ఈ ఘటనను అక్కడున్న మరో వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘టోల్ వసూలు చేయడానికి వచ్చిన ఏనుగు’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి అదృష్టం బాగుంది.. ఎంతో లక్కీగా తప్పించుకున్నాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 44వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Train Funny Video: ఇతడి తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. సింగిల్ సీటునే స్లీపర్‌గా మార్చేశాడుగా..
ఇవి కూడా చదవండి..
Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..