Share News

Train Funny Video: ఇతడి తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. సింగిల్ సీటునే స్లీపర్‌గా మార్చేశాడుగా..

ABN , Publish Date - May 10 , 2025 | 08:11 AM

వ్యక్తి రైల్లో కిటికీ పక్కన కూర్చున్నాడు. అయితే మధ్యలో నిద్ర ముంచుకొచ్చేయడంతో పడుకోవాలని అనుకున్నాడు. నిద్ర వస్తున్నా కూడా కానీ సింగిల్ సీటు కావడంతో పడుకోవడానికి వీలు కాలేదు. అయినా ఎలాగైనా పడుకోవాలని ఫిక్స్ అయ్యాడు. చివరకు ఏం చేశాడో చూడండి..

Train Funny Video: ఇతడి తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. సింగిల్ సీటునే స్లీపర్‌గా మార్చేశాడుగా..

రైలు ప్రయాణాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. కొందరు సీట్ల కోసం విచిత్ర సాహసాలు చేయడం చూస్తుంటాం. మరికొందరు సీట్లు లేకున్నా సొంతంగా క్రియేట్ చేసుకుంటుంటారు. ఇలాంటి సమయాల్లో కొందరు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, ఇలాంటి ప్రయోగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రైల్లో సింగిల్ సీటును స్లీపర్‌గా మార్చడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇతడి తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రైల్లో కిటికీ పక్కన కూర్చున్నాడు. అయితే మధ్యలో నిద్ర ముంచుకొచ్చేయడంతో పడుకోవాలని అనుకున్నాడు.

Robot Funny Video: సినిమా చూపించిన రోబో.. యజమానిని ఎలా భయపెట్టిందో చూస్తే..


నిద్ర వస్తున్నా కూడా కానీ సింగిల్ సీటు కావడంతో పడుకోవడానికి వీలు కాలేదు. అయినా ఎలాగైనా పడుకోవాలని ఫిక్స్ అయ్యాడు. చివరకు బ్యాగులోని దుప్పటి బయటికి తీసి, రెండు సీట్ల మధ్యలో కిటికీకి కట్టేశాడు. తర్వాత ఆ దుప్పటిలో (Man sleeping in single seat with help of blanket) కాళ్లు పెట్టి పడుకున్నాడు. ఇలా దుప్పటి సాయంతో సింగిల్ సీటును కాస్తా.. స్లీపర్‌గా మార్చేసి పడుకున్నాడు.

Marriage Funny Video: పెళ్లిలో అతిథులకు వింత కష్టం.. ఏం చేస్తున్నారో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Woman Viral Video: వాగుపై విన్యాసాలు చేస్తూ రీల్స్.. చివరకు ఈ యువతికి ఏమైందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 10 , 2025 | 08:11 AM