Share News

Girl Trick Viral Video: ఈ బాలిక టెక్నిక్ మామూలుగా లేదుగా.. వింత పరీక్షలో ఎలా నెగ్గిందో చూస్తే..

ABN , Publish Date - Nov 01 , 2025 | 11:30 AM

పాఠశాలలలో టీచర్.. తన విద్యార్థులకు ఓ వింత పరీక్ష పెడుతుంది. నీళ్ల గ్లాసులో తొక్కతీసిన నారింజ పండును వేసింది. దాన్ని బయటికి తీయాలనేది పరీక్ష. అయితే ఆ గ్లాసులోని నీళ్లు ఒలికిపోకుండా, అడుగున ఉన్న పండును బయటికి తీయాలనేదే అసలు ట్విస్ట్. చివరకు ఓం జరిగిందో మీరే చూడండి..

Girl Trick Viral Video: ఈ బాలిక టెక్నిక్ మామూలుగా లేదుగా.. వింత పరీక్షలో ఎలా నెగ్గిందో చూస్తే..

కొందరు వయసులో చిన్న పిల్లలే అయినా తెలివిలో మాత్రం పెద్దవారిలా వ్యవహరిస్తుంటారు. మరికొందరు పెద్ద వారు కూడా చేయలేని పనులను ఎంతో సులభంగా చేసేస్తుంటారు. ఇంకొందరు పిల్లలు టెక్నిక్‌తో చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి తెలివైన పిల్లలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా , ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. విద్యార్థులకు పెట్టిన వింత పరీక్షలో ఓ బాలిక ఎంతో తెలివిగా నెగ్గేసింది. ఈ వీడియో చూసిన వారంతా బాలిక టెక్నిక్ మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పాఠశాలలలో టీచర్.. తన విద్యార్థులకు ఓ వింత పరీక్ష పెడుతుంది. నీళ్ల గ్లాసులో తొక్కతీసిన (Orange in glass of water) నారింజ పండును వేసింది. దాన్ని బయటికి తీయాలనేది పరీక్ష. అదేమైనా పెద్ద కష్టమా.. అని అనుకుంటున్నారా.. ఇక్కడే అసలు మెలిక ఉంది. ఆ గ్లాసులోని నీళ్లు ఒలికిపోకుండా, అడుగున ఉన్న పండును బయటికి తీయాలనేదే అసలు ట్విస్ట్. విద్యార్థులంతా ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి.. నీళ్ల గ్లాసు అడుగున ఉన్న పండును బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎంత జాగ్రత్తగా బయటికి తీయాలని చూసినా కూడా.. నీళ్లు బయటికి వస్తున్నాయి.


కొందరైతే చేతి వేళ్లను మెల్లిగా గ్లాసులోకి పెట్టి, పండును బయటికి తీయాలని చూశారు. కానీ చేయి నీళ్లలో పెట్టగానే ఆటోమేటిక్‌గా నీళ్లు బయటికి వచ్చి కిందపడుతున్నాయి. ఇలా అంతా విఫలమవుతున్న సమయంలో చివరగా ఓ బాలిక అక్కడికి వచ్చి నిలబడింది. ఆమె కూడా అందరిలాగా ఈ పరీక్షలో ఫెయిల్ అవుతుందని అంతా భావించారు. అయితే ఆ బాలిక అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఎంతో చాకచక్యంగా (girl takes out an orange from glass of water) పండును బయటికి తీసింది. ఇందులోసం ఆమె చేతి వేళితో నీళ్లను గుండ్రంగా సుడిలా తిప్పేస్తుంది.


ఇలా గ్లాసులోని నీళ్లను గిరగిరా తిప్పడంతో ఆ తాకిడికి కింద ఉన్న నారింజ పండు నీటి పైకి వచ్చింది. దీంతో ఆ బాలిక ఎంతో ఈజీగా ఆ పండును చేతిలోకి తీసుకుందన్నమాట. వినోదంగా కనిపిస్తున్న ఈ ఆట వెనుక ఉన్న సైన్స్‌ను టీచర్ తన విద్యార్థులకు వివరించింది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఈ పరీక్ష మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘విద్యా్ర్థులకు ఇలాంటివి నేర్పించాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 లక్షలకు పైగా లైక్‌‌లు, 99. 5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

లగేజీ చూసి.. అంతా లారీ అని అనుకున్నారు.. చివరకు ముందు వైపు చూసి షాక్ అయ్యారు..

రోడ్డు పక్కన పొదల్లో పడిపోయిన యువతి.. సమీపానికి వెళ్లి చూడగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 01 , 2025 | 11:30 AM