Manchu Lakshmi: తెలుగు రాష్ట్రాల్లో విద్యా విప్లవం మంచు లక్ష్మీ ఆశయం
ABN , Publish Date - Aug 11 , 2025 | 01:32 PM
ప్రతి గ్రామంలో ఒక్కరిని బాగు చేస్తే వారే ఊరును బాగు చేస్తారని టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్, సినీ హీరోయిన్ మంచు లక్ష్మీప్రసన్న వ్యాఖ్యానించారు. తమ ఫౌండేషన్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు చేయూతనిస్తున్నామని వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా, ఆగస్టు11 (ఆంధ్రజ్యోతి): ప్రతి గ్రామంలో ఒక్కరిని బాగు చేస్తే వారే ఊరును బాగు చేస్తారని టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్, సినీ హీరోయిన్ మంచు లక్ష్మీప్రసన్న (Manchu Lakshmi Prasanna) వ్యాఖ్యానించారు. ఇవాళ(సోమవారం) శంకర్‌పల్లి మండలంలో పర్యటించారు. జన్వాడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వీణరావు ఫౌండేషన్ చైర్మన్ రత్నారెడ్డి ఆధ్వర్యంలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభించారు. అలాగే విద్యార్థులకు నైపుణ్యం గల స్కిల్స్ ట్యాబ్స్, బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచు లక్ష్మీప్రసన్న, ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంచు లక్ష్మీప్రసన్న మీడియాతో మాట్లాడారు. వీణరావు ఫౌండేషన్ విద్య, ఆరోగ్య సంరక్షణ, సీనియర్ సిటిజన్ల సంక్షేమంలో సమాజానికి సహాయం చేస్తుందని చెప్పుకొచ్చారు. విద్యార్థులకు నైపుణ్యం గల విద్యను అందించడానికి తాము కృషి చేస్తున్నామని తెలిపారు. వీణరావు ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్స్ అందిస్తున్నామని పేర్కొన్నారు. జన్వాడలో విద్యార్థులకు తమ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేకంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశామని వివరించారు. తమ ఫౌండేషన్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు చేయూత ఇస్తున్నామని వెల్లడించారు మంచు లక్ష్మీప్రసన్న.
అంగన్‌వాడీ విద్యార్థులకు కూడా మంచి చదువును అందిస్తున్నామని మంచు లక్ష్మీప్రసన్న ఉద్ఘాటించారు. రానున్న రోజుల్లో టీచర్స్ ఎక్కడ ఉన్న డిజిటల్ క్లాసుల ద్వారా విద్యార్థులకు విద్యను అందించవచ్చని సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని విద్యార్థులందరూ టీచ్ ఫర్ చేంజ్ అనే కోణంతో ఉండాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు తమ ఫౌండేషన్ ద్వారా ఎలాంటి సహాకారమైనా అందిస్తామని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అక్బర్, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు విద్యను బోధిస్తున్న అధ్యాపకులను మంచు లక్ష్మీప్రసనన్న, ఎమ్మెల్యే కాలే యాదయ్య అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి
బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన రానా దగ్గుబాటి
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం..
Read Latest Telangana News And Telugu News