Hyderabad : పోలీసుల ఆధ్వర్యంలో పీపుల్స్‌ ప్లాజా రన్‌ ఫర్‌ యాక్షన్‌-2025..

ABN, Publish Date - Mar 08 , 2025 | 12:11 PM

Hyderabad Police : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ పోలీసులు పీపుల్స్‌ ప్లాజా నుంచి రన్‌ ఫర్‌ యాక్షన్‌-2025 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క విచ్చేశారు. రన్‌ ఫర్‌ యాక్షన్‌లో..

Hyderabad : పోలీసుల ఆధ్వర్యంలో పీపుల్స్‌ ప్లాజా రన్‌ ఫర్‌ యాక్షన్‌-2025.. 1/5

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీసులు పీపుల్స్‌ ప్లాజా నుంచి రన్ ఫర్ యాక్షన్-2025 కార్యక్రమం నిర్వహించారు.

Hyderabad : పోలీసుల ఆధ్వర్యంలో పీపుల్స్‌ ప్లాజా రన్‌ ఫర్‌ యాక్షన్‌-2025.. 2/5

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో జరిగిన రన్‌ ఫర్‌ యాక్షన్‌-2025 కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా విచ్చేశారు. రన్ ఫర్ యాక్షన్ 2025 ని జెండా ఊపి ప్రారంభించారు.

Hyderabad : పోలీసుల ఆధ్వర్యంలో పీపుల్స్‌ ప్లాజా రన్‌ ఫర్‌ యాక్షన్‌-2025.. 3/5

5k రన్, 2k రన్ పోటీల్లో యువతీయువకులు, మహిళలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పరుగు పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందించారు.

Hyderabad : పోలీసుల ఆధ్వర్యంలో పీపుల్స్‌ ప్లాజా రన్‌ ఫర్‌ యాక్షన్‌-2025.. 4/5

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, అడినల్ సీపీ విక్రమ్ మాన్, అడిషనల్ సీపీ క్రైమ్స్ విశ్వ ప్రసాద్ సహా ఇతర డీసీపీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Hyderabad : పోలీసుల ఆధ్వర్యంలో పీపుల్స్‌ ప్లాజా రన్‌ ఫర్‌ యాక్షన్‌-2025.. 5/5

మహిళలకు మంచి స్ట్రెంత్ ఇచ్చేలా ఈ రన్ ఏర్పాటు చేసినందుకు పోీలీసులకు అభినందనలు తెలిపారు మంత్రి సీతక్క. అలాగే ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ సీపీ సీవీ ఆనంద్ సీతక్కను ఉమెన్ ఆఫ్ స్ట్రగుల్ అంటూ కొనియాడారు.

Updated at - Mar 08 , 2025 | 12:15 PM