Chaitanyananda Case: ఢిల్లీ బాబా వాట్సాప్ చాట్‌లో షాకింగ్ విషయాలు.. దుబాయ్ షేక్‌కు ఆ అవసరాలు తీర్చాలంటూ..
ABN , Publish Date - Oct 01 , 2025 | 04:21 PM
ఢిల్లీ బాబా చైతన్యానంద సరస్వతి కేసులో షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థినులను లైంగికంగా వేధించిన సదరు బాబాను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో అతడి ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో..
ఢిల్లీ బాబా చైతన్యానంద సరస్వతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ వసంత్‌కుంజ్‌లో ఉన్న శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ విద్యార్థినులను వేధించిన ఆరోపణలపై చైతన్యానందను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణలో భాగంగా చైతన్యానంద వాట్సాప్ చాటింగ్‌ను పరిశీలించగా.. దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్ షేక్ శారీరక అవసరాలు తీర్చేందుకు తన ఆధీనంలోని విద్యాసంస్థకు చెందిన విద్యార్థినితో చైతన్యానంద మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ బాబా చైతన్యానంద సరస్వతి (Baba Chaitanyananda Saraswati) కేసులో షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థినులను లైంగికంగా వేధించిన సదరు బాబాను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో పలువురు యువతుల ఫొటోలతో పాటూ సిబ్బంది, విద్యార్థినులతో జరిపిన వాట్సాప్ చాట్ (WhatsApp chatting) బయటపడింది. ఆ చాటింగ్‌లో చైతన్యానంద సరస్వతి.. దుబాయ్ షేక్‌కు (Dubai Sheikh) శారీరక అవసరాలు తీర్చేందుకు తన ఆధీనంలోని విద్యాసంస్థకు చెందిన విద్యార్థినితో మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. అందులో చాటింగ్ ఈ విధంగా ఉంది..
బాబా: తనకు పార్టనర్ కావాలని దుబాయ్ షేక్ ఒకరు అడుగుతున్నారు. అందుకు అనువుగా ఎవరైనా మంచిగా ఉన్నారా?
విద్యార్థిని: ‘కోయీ నహీ హై’ (ఎవరూ లేరు)
బాబా: ‘ఎందుకని?’
విద్యార్థిని: ‘నాకు తెలియదు’
బాబా: ‘నీ క్లాస్‌మేట్ ఎవరైనా? జూనియర్?’
బాబా: ‘బేబీయ్’ (రాత్రి 7:49)
‘బేబీ నువ్వు ఎక్కడున్నావు?’ (రాత్రి 11:59)
‘గుడ్ మార్నింగ్ బేబీ’ (రాత్రి 12:40)
‘నా మీద నీకు ఎందుకు కోపం?’
‘గుడ్ ఈవెనింగ్.. నాకు అత్యంత ప్రియమైన బేబీ డాటర్ డాల్’
విద్యార్థిని: ‘ఇది మధ్యాహ్నం సార్, హ్యాపీ గుడ్ ఆఫ్టర్ నూన్.. మీరు ఏదైనా తిన్నారా సార్?’
బాబా: ‘డిస్కో డ్యాన్స్ చేస్తున్నాను’ నాతో జాయిన్ అవుతావా?
ఇలా చైతన్యానంద బాబా.. సదరు విద్యార్థినితో వాట్సాప్ చాటింగ్ కొనసాగించాడు. దీంతో పాటూ చాలా మంది విద్యార్థినులతో అసభ్యకరంగా 'బేబీ', 'ఐ లవ్ యు', 'ఐ ఆడోర్ యు' వంటి పదాలతో కూడా చాటింగ్ కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సదరు బాబా మొత్తం 17 మంది విద్యార్థులను వేధించాడని ఆరోపణలు వచ్చాయి. పోలీసుల నుంచి రెండు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న బాబాను.. ఆదివారం తెల్లవారుజామున ఆగ్రాలోని తాజ్ గంజ్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. ఇతడితో పాటూ ఇద్దరు మహిళా సహచరులనూ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తనను ఎవరూ గుర్తించకుండా సదరు బాబా ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
బిహార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ
26/11 దాడుల తర్వాత పాక్‌తో యుద్ధం వద్దని చెప్పిన ఆమెరికా.. చిదంబరం వెల్లడి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి