Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్.. అసలోడు దొరికేశాడు
ABN , Publish Date - Jan 19 , 2025 | 08:32 AM
Vijay Das Arrest: రోజుకో మలుపు తిరుగుతున్న నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసులో మరో బిగ్ ట్విస్ట్. అసలోడ్ని పట్టుకున్నారు ముంబై పోలీసులు. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. నిందితుడ్ని ముంబై పోలీసులు పట్టుకున్నారంటూ శనివారం నాడు కథనాలు వచ్చాయి. బాండ్రా పోలీసులు ఒక వ్యక్తిని పట్టుకొని స్టేషన్‌కు తీసుకెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేశాయి. దీంతో నిందితుడు దొరికాడని అంతా అనుకున్నారు. అయితే తమ అదుపులో ఉన్నది నిందితుడు కాదని.. ఆ వ్యక్తికి సైఫ్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని కొద్ది సేపటికి పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ తరుణంలో తాజాగా ముంబై పోలీసులు మరోమారు స్పందించారు. ఈ కేసులో అసలు నిందితుడు విజయ్ దాస్‌ను తాము అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. సైఫ్ మీద దాడి చేసింది తానేనని అతడు ఒప్పుకున్నాడని పేర్కొన్నారు.
అసలు పేరేంటి?
‘ఈ కేసులో నిందితుడు విజయ్ దాస్‌ను అరెస్ట్ చేశాం. అతడు రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. నేరం చేశానని అతడు ఒప్పుకున్నాడు’ అని పోలీసులు తెలిపారు. నిందితుడు తన పేరును మొదట విజయ్ దాస్ అని చెప్పాడని.. కానీ ఆ తర్వాత తాను మహ్మద్ సాజిద్ అని పేర్కొన్నాడని సమాచారం. అయితే అతడి అసలు పేరు ఏంటి? ఈ నేరం ఎందుకు చేశాడు? దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా? ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయం ఉంది? అతడికి ఎవరు సహకరించారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇవీ చదవండి:
మీ ఈపీఎఫ్ వ్యక్తిగత వివరాల్లో మార్పులు మీరే చేసుకోవచ్చు!
అద్దెకు ఉండే వారికి ఉచిత విద్యుత్తు, నీరు
ఫుట్‌బాల్ కోసం 30లక్షల వీధి కుక్కల హతం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి