Share News

Hostel Spy Camera: లేడీస్ హాస్టల్ టాయిలెట్‌లో స్పై కెమెరాలు

ABN , Publish Date - Nov 05 , 2025 | 07:56 PM

ఒక ప్రముఖ సంస్థ తమ ఉద్యోగుల కోసం హాస్టల్స్ నిర్వహిస్తోంది. అక్కడ వేలాది మంది మహిళలు, యువతులు ఉంటున్నారు. ఆ వసతి గృహంలో ఉంటున్న ఒడిశాకు చెందిన ఒక మహిళా ఉద్యోగి ఈ కెమెరాలను అమర్చింది.

 Hostel Spy Camera: లేడీస్ హాస్టల్ టాయిలెట్‌లో స్పై కెమెరాలు
hostel spy camera

తమిళనాడు, నవంబర్ 5: ఇటీవల కాలంలో హోటల్స్ లోని గదులు, వాష్ రూమ్స్ వంటి వాటిల్లో కొందరు స్పై కెమెరాలు(Hostel Spy Camera) ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాక వీటి ద్వారా ఎంతో మంది మహిళల, యువతుల వ్యక్తిగత వీడియోలనూ రికార్డు చేస్తున్నారు. రహస్య కెమెరాల నియంత్రణకు పోలీసులు అనేక చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ ఏదో ఒక ప్రాంతంలో ఈ స్పై కెమెరాలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రం క్రిష్ణ గిరి జిల్లా(Krishanagiri District)లోని మహిళల వసతి గృహ టాయిలెట్స్(Toilets) లో స్పై కెమెరాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఒక టాయిలెట్‌లో వాటిని గుర్తించిన మహిళలు ఆందోళనకు దిగారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..


ఒక ప్రముఖ సంస్థ తమ ఉద్యోగుల కోసం హాస్టల్స్(Hostel) నిర్వహిస్తోంది. అక్కడ వేలాది మంది మహిళలు, యువతులు ఉంటున్నారు. ఆ వసతి గృహంలో ఉంటున్న ఒడిశా(Odisha)కు చెందిన ఒక మహిళా ఉద్యోగి ఈ కెమెరాలను అమర్చింది. ఎవరికి అనుమానం రాకుండా రహస్యంగా మహిళల వీడియోలు చిత్రీకరిస్తోంది. ఈ క్రమంలో ఆ హాస్టల్‌లోనే ఉంటున్న మరో మహిళకు ఆమె కదలికలపై అనుమానం వచ్చింది. వెంటనే హాస్టల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లింది. వారు వసతి గృహం మొత్తం తనిఖీ చేయగా.. టాయిలెట్స్ లో కెమెరాల(Spy Camera) ఉన్న గుట్టు బయటపడింది. ఈ విషయం కాస్తా బయటికి పొక్కడంతో తీవ్ర కలకలం రేగింది.


ఆ హాస్టల్ లో ఉంటున్న సుమారు రెండువేల మంది మహిళలు ఆందోళనకు దిగారు. హాస్టల్ మహిళలు ఇచ్చిన సమాచారంతో వసతి గృహానికి చేరుకున్న పోలీసులు నిందితురాలి(Odisha woman)ని అరెస్టు చేశారు. ఈ ఘటనపై సదరు ప్రైవేటు సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. నిందితురాలు ఇంకా ఏమైనా వీడియోలు రికార్డు చేసిందా..? ఇందులో ఇంకెవరి ప్రమేయం ఉందనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఫుటేజీని ఆమె తన స్నేహితుడికి పంపాలని ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు(Tamil Nadu police raids) దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. 25 లక్షల దొంగ ఓట్లంటూ..

ఎస్ఐఆర్‌ను మీరు సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా.. రాహుల్ ఆరోపణలపై ఈసీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 05 , 2025 | 07:56 PM