Bengaluru News: బాంబు పేల్చిన ఎమ్మెల్యే.. కాబోయే సీఎం మల్లికార్జున ఖర్గే
ABN , Publish Date - Oct 30 , 2025 | 01:54 PM
రాష్ట్రంలో నవంబరు క్రాంతి జరుగుతుందని, లాబీ చేసేవారికి పదవి లభించదని, మల్లికార్జునఖర్గే ముఖ్యమంత్రి అవుతారని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ అన్నారు. గురువారం బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్లో సీఎం పదవికోసం కుస్తీ ప్రారంభమైందన్నారు.
- ఎమ్మెల్యే యత్నాళ్
బెంగళూరు: రాష్ట్రంలో నవంబరు క్రాంతి జరుగుతుందని, లాబీ చేసేవారికి పదవి లభించదని, మల్లికార్జునఖర్గే(Mallikarjuna Karge) ముఖ్యమంత్రి అవుతారని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్(Vijayapura MLA Basavagowda Patil) అన్నారు. గురువారం బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్లో సీఎం పదవికోసం కుస్తీ ప్రారంభమైందన్నారు. ప్రతి ఆశావాహి లాబీ జరుపుతున్నారన్నారు. వారికి మద్దతుగా మాట్లాడేవారు తెరపైకి వస్తున్నారన్నారు.
ఈ కుస్తీలో వినపడని మల్లికార్జున ఖర్గే చిత్రంలో కనిపిస్తారన్నారు. రాష్ట్ర సారథ్యం డార్క్‌హార్స్‌కు లభిస్తుందన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఖర్గే ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నారన్నారు. ఖర్గే పేరు బయటకు వస్తే సతీశ్ జార్కిహొళి, డీకే శివకుమార్ పోటీనుంచి వెనుకడుగు వేస్తారన్నారు. గోవా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ(BJP) తరఫున ప్రచారం చేస్తారన్నారు.

బీజేపీ(BJP) అధిష్ఠానం నన్ను వాపసు తీసుకోకుంటే జేసీబీ (జేడీఎస్-కాంగ్రెస్-బీజేపీ)లోని కొంతమందితో పార్టీ పెడతానని, 2028లో ముఖ్యమంత్రి అవుతానన్నారు. మూడుపార్టీలనుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. విజయేంద్రను మరోసారి అధ్యక్షుడిగా కొనసాగిస్తామని ప్రకటించిన రోజే కొత్తపార్టీ ప్రకటిస్తానన్నారు. మూడు పార్టీల అసంతృప్తులతో కలసి ముందుకెళ్తానన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్.. భిన్నంగా ఓటర్ పల్స్!
బీఆర్‌ఎస్ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు
Read Latest Telangana News and National News