BRS Working President K. T. Rama Rao: బీఆర్‌ఎస్ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు
ABN , Publish Date - Oct 30 , 2025 | 05:00 AM
జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ గెలిేస్త మళ్లీ మూడేళ్ల వరకు ప్రజలు వేచి చూడాల్సిన అవసరం రాకపోవచ్చని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు...
జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్ధిని గెలిపిస్తే ఏమైనా జరగొచ్చు
రాష్ట్రంలో ఎటువంటి మార్పులైనా సంభవించవచ్చు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు
హైదరాబాద్, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ గెలిేస్త మళ్లీ మూడేళ్ల వరకు ప్రజలు వేచి చూడాల్సిన అవసరం రాకపోవచ్చని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే రాష్ట్రంలో ఏమైనా జరగొచ్చని, ఎటువంటి మార్పులైనా సంభవిస్తాయన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మున్నూరుకాపు సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 11న జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రె్‌సకు బుద్ధి చెప్పాలని, భవిష్యత్తులో కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. 4కోట్లమంది రాష్ట్ర ప్రజలు 4లక్షలమంది ఓటర్ల వైపు చూస్తున్నారని, జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎ్‌సకు ఓటేేస్త కాంగ్రె్‌సకు బుద్ధి వస్తుందన్నారు. కాంగ్రె్‌సకు ఓటేయాలనే ఉత్సాహం ఎవ్వరిలోనూ కనిపించడం లేదని, అందుకే కాంగ్రెస్ కొత్తవేషాలు వేస్తోందని, మంత్రులు గల్లీ లీడర్లలాగా తిరుగుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దొంగఓట్లతో అప్రమత్తంగా ఉండాలని, కాంగ్రెస్ 12 నుంచి 13వేల దొంగఓట్లు సృష్టించిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి రెండేళ్ల కిందట ప్రజలు మోసపోయారని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ డబ్బులిస్తే తీసుకోవాలని, ఓటుమాత్రం బీఆర్‌ఎస్ అభ్యర్థికే వేయాలని ఆయన ఓటర్లకు సూచించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఒక్క ఇల్లు కూడా కట్టకపోగా, వేలాది ఇళ్లను నేలమట్టం చేశారని, పెద్దల ఇండ్లజోలికి వెళ్లని హైడ్రా పేదల ఇళ్లు కనిపిేస్త కూల్చివేస్తోందన్నారు. 42శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ బీసీలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందని, పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేేస్తనే ఇది జరుగుతుందని తాము ముందే చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని కేటీఆర్ చెప్పారు.