Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో 54.31 కోట్ల మంది పవిత్ర స్నానం.. ఈరోజు ఒక్క రోజే
ABN , Publish Date - Feb 17 , 2025 | 09:59 PM
మరికొన్ని రోజుల్లో ముగియనున్న ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు భక్తుల తాకిడి మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు (ఫిబ్రవరి 17న) ఒక్క రోజే రాత్రి 8 నాటికి 1.23 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ప్రతి రోజు గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ సమాచార శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు (ఫిబ్రవరి 17న) రాత్రి 8 గంటల నాటికి 1.23 కోట్ల మంది భక్తులు పవిత్ర జలాల్లో స్నానం చేశారు. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళాలో, ఇప్పటివరకు 54.31 కోట్ల మంది భక్తులు స్నానం ఆచరించినట్లు ప్రకటించారు.
భక్తుల రద్దీ
మహా కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జరిగే ప్రత్యేక కార్యక్రమానికి అపూర్వమైన సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భారతదేశంతోపాటు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం భక్తుల రద్దీని నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఈ కార్యక్రమం సజావుగా జరిగిందేకు మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఫిబ్రవరి 26, 2025న ఈ కార్యక్రమం ముగిసే వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను నిర్వహిస్తోంది.
ఈసారి ప్రత్యేకం..
ఈ సంవత్సరం మహాకుంభమేళా మరింత ప్రత్యేకమైనదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఖగోళ అమరికలు, విశ్వ కలయికలతో కూడిన అరుదైన సందర్భమని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే అద్భుత జ్యోతిషశాస్త్ర సంఘటనగా గుర్తించబడింది. ఈ ప్రత్యేకమైన సందర్భం కారణంగా ప్రయాగ్‌రాజ్‌కు లక్షలాది మంది యాత్రికులు వస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఇక్కడకు వచ్చే యాత్రికులు తమ జీవితంలో శాంతి, ఆనందాన్ని పొందడానికి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.
దీంతో మహా కుంభమేళా కేవలం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు, భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక మూలాలకు చిహ్నంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా పలువురు భక్తులు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తూ, తమ జీవితంలో కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Viral News: పార్లమెంటులో అబద్ధం చెప్పిన ఎంపీ.. ఫైన్ విధించిన కోర్టు, పదవి కూడా..
CBSE Board Exam 2025: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష పేపర్ లీక్.. బోర్డ్ క్లారిటీ
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News