Today Top 5 News: టు డే టాప్-5 న్యూస్ ఇవే..
ABN , Publish Date - Aug 15 , 2025 | 08:04 PM
నేడు(శుక్రవారం) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలకు పలు గుడ్ న్యూస్‌లు చెప్పాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కార్ స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించగా.. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం పలు కీలక అంశాలను ప్రజలతో పంచుకున్నారు. ఈ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..
అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న'స్త్రీ శక్తి' పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గుహల నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణిస్తూ ఈ పథకాన్ని ప్రారంభించారు.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
న్యూఢిల్లీ: రైతన్నలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఎర్రకోట వేదిక నుంచి భరోసా ఇచ్చారు. దేశం స్వయంసమృద్ధికి పాటుపడుతున్న రైతులకు అండగా నిలుస్తామని, వారి ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమెరికాతో 'ట్రేడ్ డీల్' విషయంలో ప్రతిష్ఠంభన కొనసాగుతుండటం, ట్రంప్ టారిఫ్ బెదిరింపుల నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
హైదరాబాద్: బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గోల్కొండలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటివాటా హక్కుపై రాజీలేదని తేల్చి చెప్పారు. తెలంగాణకు రావాల్సిన నీళ్ల వాటా దక్కించుకుంటాం అని అన్నారు. మన అవసరాలు తీరాకే మిగతా రాష్ట్రాలకు నీరు అందిస్తామని అన్నారు.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
జమ్మూకాశ్మీర్: చషోటి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ పెను విషాదం మిగిల్సిన సంగతి తెలిసిందే. క్లౌబ్ బరస్ట్ కారణంగా పదుల సంఖ్యలో జనం ప్రాణాలు పోగొట్టుకోగా.. దాదాపు 200 మంది గల్లంతు అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం నాటికి మృతుల సంఖ్య 46 నుంచి 60కి చేరింది. చనిపోయిన వారిలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.సంఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ఊపందుకున్నాయి.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభించింది. నేషనల్ హైవే (NH), నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వే (NE)పై ప్రయాణించే వాణిజ్యేతర వాహనదారులకు వార్షిక టోల్ పాస్ (FASTag annual pass) ను ప్రవేశపెట్టింది. NHAI ప్రవేశపెట్టిన కొత్త FASTag వార్షిక పాస్ వాహనదారుల డబ్బు ఆదా చేసే గొప్ప మార్గం. ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పాస్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి రవాణా శాఖ 'రాజ్‌మార్గ్ యాత్ర' యాప్‌లో ప్రత్యేక లింక్ అందుబాటులో ఉంచింది.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్.. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం దంపతులు
ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా..
Read Latest Telangana News and National News