Share News

At Home in AP Raj Bhavan: రాజ్‌భవన్‌‌లో ఎట్ హోమ్.. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం దంపతులు

ABN , Publish Date - Aug 15 , 2025 | 06:35 PM

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్‌లో గురువారం ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు ఆయన భార్య అన్నా లేజినోవా దంపతులు హాజరయ్యారు.

At Home in AP Raj Bhavan: రాజ్‌భవన్‌‌లో ఎట్ హోమ్.. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం దంపతులు
At Home in AP Raj Bhavan

విజయవాడ, ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్‌లో గురువారం నాడు ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు ఆయన భార్య అన్నా లేజినోవా దంపతులు హాజరయ్యారు. అలాగే ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్‌తోపాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్.. అతిథుల వద్దకు స్వయంగా వెళ్లి వారిని ఆత్మీయంగా పలకరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫామ్‌హౌస్‌కు చేరుకున్న కవిత

ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా..

For Mora AP News And Telugu News

Updated Date - Aug 15 , 2025 | 09:04 PM