Share News

Helicopter Crash: ఎంఐ-17 హెలికాప్టర్ కుప్పకూలి ఐదుగురు మృతి

ABN , Publish Date - Aug 15 , 2025 | 07:03 PM

బిజాపూర్‌లోని వర్షప్రభావిత ప్రాంతంలో బాధితుల కోసం సహాయ సామగ్రితో హెలికాప్టర్ వెళ్తుండగా మొహమాండ్ జిల్లా పాండియాలి వద్ద కుప్పకూలిందని గందాపుర్ తెలిపారు. వాతావరణ ప్రతికూలత కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు.

Helicopter Crash: ఎంఐ-17 హెలికాప్టర్ కుప్పకూలి ఐదుగురు మృతి
HI-17 Helicopter

ఇస్లామాబాద్: సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఎంఐ-17 హెలికాప్టర్ ఉత్తర పాకిస్థాన్‌లో శుక్రవారంనాడు కుప్పకూలింది. ప్రతికూల వాతావరణం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లోని ఐదుగురు సిబ్బంది మృతి చెందినట్టు ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్ర ముఖ్యమంత్రి సర్దార్ అలి అమిన్ ఖాన్ గందాపుర్ తెలిపారు. వీరిలో ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు.

బిజాపూర్‌లోని వర్షప్రభావిత ప్రాంతంలో బాధితుల కోసం సహాయ సామగ్రితో హెలికాప్టర్ వెళ్తుండగా మొహమాండ్ జిల్లా పాండియాలి వద్ద కుప్పకూలిందని గందాపుర్ తెలిపారు. వాతావరణ ప్రతికూలత కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు.

ఉత్తర పాకిస్థాన్‌లో మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో గత 24 గంటల్లో 164 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఏఎఫ్‌పీ తెలిపింది. వీరిలో 150 మంది ఖైఖర్ పఖ్తుంఖ్వాలో మరణించినట్టు నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ తెలిపింది.

ఇవి కూడా చదవండి..

ఆస్ట్రేలియాలో భారతీయుల స్వాతంత్ర్య వేడుకలను అడ్డుకున్న ఖలిస్థానీలు

పుతిన్‌, ట్రంప్‌ భేటీ విఫలమైతే.. భారత్‌పై మరిన్ని సుంకాలు

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 15 , 2025 | 07:11 PM