At Home in Telangana Raj Bhavan: రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్.. హాజరైన సీఎం.. బీఆర్ఎస్ దూరం
ABN , Publish Date - Aug 15 , 2025 | 07:46 PM
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో గురువారం ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.
హైదరాబాద్, ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో గురువారం ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్బంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు మంత్రి వర్గ సహచరులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పేరు పేరున పరిచయం చేశారు.
అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన నేతల వద్దకు వెళ్లి వారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి పలకరించారు. ఇక బీజేపీ ఎంపీలు కె.లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్ రావును సీఎం రేవంత్ రెడ్డి పలకరించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరోవైపు.. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క ప్రజాప్రతినిధి సైతం హాజరు కాలేదని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్.. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం దంపతులు
ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా..
Read Latest Telangana News and National News